Main Menu

వైసీపీ నుంచి మ‌రో ఎమ్మెల్యే అవుట్..

Spread the love

వైసీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఇప్ప‌టికే వివిధ పార్టీల నేత‌లు వైసీపీ కండువాలు క‌ప్పుకుంటుండ‌గా మ‌రోవైపు వైసీపీ నుంచి ప‌లువురు ఎమ్మెల్యేలు చేజారిపోతున్నారు. తాజాగా క‌ర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరు చ‌రితా రెడ్డి చంద్ర‌బాబు స‌మ‌క్షంలో సైకిలెక్కేస్తున్న స‌మ‌యంలో మ‌రో రాయల‌సీమ ఎమ్మెల్యే కూడా ఆమె బాటలో సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

దాంతో చిత్తూరు జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. మ‌ద‌న‌ప‌ల్లి నుంచి ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి మ‌రోసారి బ‌రిలో దిగాల‌ని ఆశిస్తున్నారు. కానీ ఆర్థికంగా స్తోమ‌త లేద‌నే కార‌ణంతో తిప్పారెడ్డి స్థానంలో మ‌రొక‌రికి చాన్స్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణయించుకున్నారు. ఈ ప‌రిణామమే ఇప్పుడు వైసీపీ చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

నేరుగా జ‌గ‌న్ ని కలిసి విన్న‌వించినా త‌న సీటు గ్యారంటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఇక పార్టీ మారాల‌నే నిర్ణ‌యానికి తిప్పారెడ్డి వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. త‌న స‌న్నిహితుల మ‌ధ్య ఆవేద‌న వెలిబుచ్చిన తిప్పారెడ్డి త‌దుప‌రి ఏపార్టీలో చేరాల‌న్న దానిపై నిర్ణ‌యం తీసుకునేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. టీడీపీలో చేరే అవ‌కాశం ఉంద‌ని ప్రచారం మొద‌ల‌య్యింది. 2014 ఎన్నిక‌ల్లో 67 మంది అభ్య‌ర్థులు గెల‌వ‌గా ఇప్ప‌టికే 24 మంది ఫిరాయించ‌గా తిప్పారెడ్డి నెంబ‌ర్ 25 కావ‌డం విశేషం.






Related News

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the loveమెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్Read More

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *