Main Menu

జ‌న‌సేన‌కు ఎదురుదెబ్బ‌లు..!

Spread the love

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయంగా త‌న వైఖ‌రి మార్చుకున్న త‌ర్వాత పార్టీకి కొంత ఊపు వ‌చ్చింది. జ‌న‌సేన జ‌వ‌స‌త్వాలు పొందుతున్న‌ట్టు క‌నిపించింది. ఒక్కో నాయకుడు వ‌చ్చి చేర‌డంతో జ‌న‌సేనానికి ఊపు వ‌స్తున్న‌ట్టుగా అంతా భావించారు. ఆ క్ర‌మంలో వివిధ పార్టీల నేత‌ల‌తో పాటు ఏపార్టీలోనూ చేర‌ని కొంద‌రు మేథావులు కూడా జ‌న‌సేన వైపు మొగ్గు చూపారు. అలాంటి వారిలో మాజీ ఆర్టీఐ క‌మిష‌న‌ర్ విజ‌య‌బాబు వంటి వారు ఒక‌రు.

అయితే తాజాగా విజ‌య్ బాబు రాజీనామా చేశారు. వాస్త‌వానికి తోట చంద్ర‌శేఖ‌ర్ పార్టీ మారిన త‌ర్వాత విజ‌య్ బాబు జ‌న‌సేన‌లోకి వ‌చ్చారు. విజ‌య్ బాబుని జ‌న‌సేన‌లో చేర‌కుండా అడ్డుకోవ‌డానికి జ‌న‌సేన మీడియా విభాగంలో కీల‌క వ్య‌క్తులు కొంద‌రు ప్ర‌య‌త్నించారు. కానీ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుగానే కాకుండా, రాజ‌కీయంగా అవ‌గాహ‌న ఉన్న విజ‌య్ బాబుని తోట తోడ్పాటుతో జ‌న‌సేన‌లో చేర్చుకున్నారు.

అంత‌కుముందు స్టూడియోల‌లో కూర్చుని జ‌న‌సేన ధోర‌ణిని త‌ప్పుబ‌ట్టిన విజ‌య్ బాబు, ముఖ్యంగా టీడీపీతో ప‌వ‌న్ తెగ‌తెంపులు చేసుకున్న త‌ర్వాత మాత్ర‌మే జ‌న‌సేన‌లోకి వ‌చ్చారు. కానీ ఇటీవ‌ల విజ‌య్ బాబు అసంతృప్తి కి కార‌ణం ప‌వ‌న్ పార్టీలో ప‌రిణామాల‌తో పాటు పార్టీ అదినేత వైఖ‌రి కూడా కార‌ణ‌మ‌ని భావిస్తున్నారు. అధికార ప‌క్షం మీద విమ‌ర్శ‌లు చేయాల్సిన స‌మ‌యంలో కూడా విప‌క్షాన్ని ఎండ‌గ‌ట్ట‌డానికే ప‌వ‌న్ ప్రాధాన్య‌త‌నివ్వ‌డం జ‌న‌సేన‌లో చాలామంది స‌హించ‌డం లేదు. విజ‌య్ బాబు కూడా ఆ క్ర‌మంలోనే పార్టీకి రాజీనామా చేసి దూర‌మ‌యిన‌ట్టుగా కొంద‌రు అనుమానిస్తున్నారు.

త‌న రాజీనామాకి వ్య‌క్తిగ‌త కార‌ణాలు అని చెబుతున్న‌ప్ప‌టికీ జ‌న‌సేన పార్టీలో వ్య‌వహారాలు విజ‌య్ బాబుకి రుచించ‌లేద‌ని స‌మాచారం. ముఖ్యంగా మీడియా వ్య‌వ‌హారాల్లో జ‌న‌సేన పార్టీ ప‌రిణామాల‌ను స‌రిదిద్దేందుకు విజ‌య్ బాబు ప్ర‌య‌త్నాల‌కు తోడ్పాటు ద‌క్క‌లేద‌ని చెబుతున్నారు. అదే స‌మ‌యంలో కొన్ని ఆటంకాలు కూడా సృష్టించి , త‌ల‌నొప్పులు తీసుకొస్తుండ‌డంతో జ‌న‌సేన‌లో కొన‌సాగ‌డం త‌న వ‌ల్ల కాద‌ని ఆయ‌న భావించిన‌ట్టు చెబుతున్నారు. ఇక విజ‌య్ బాబు దారిలోనే మ‌రికొంద‌రు నేత‌లు కూడా జ‌న‌సేన వీడేందుకు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. దాంతో ఓవైపు కొత్త నేత‌లు జేరుతుండ‌గా ఇలాంటి మేథావి వ‌ర్గం నేత‌లు దూరం అవుతుండ‌డం జ‌న‌సేన ప‌రిణామాల‌ను ఆస‌క్తిగా మారుస్తున్నాను.






Related News

వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌లో మ‌రో నెంబ‌ర్ తోడ‌య్యింది. వాస్తవానికి అధికారికంగా 67మందిని గెలిపించుకున్న ఈRead More

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the loveత్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *