Main Menu

టీడీపీలోకి వ‌ల‌స‌లు..!

Spread the love

వ‌ల‌స‌లు ఊపందుకుంటున్నాయి. సంక్రాంతి త‌ర్వాత మ‌రింత స్పీడ్ అందుకోవ‌డం ఖాయంగా ఉంది. అనూహ్యంగా అధికార‌ప‌క్షంలోకి కూడా ప‌లువురు నేత‌లు చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే 175 స్థానాలు రిజ‌ర్వ్ అయిన‌ట్టుగా క‌నిపిస్తున్న టీడీపీలోకి వ‌ల‌స‌లు ఊపందుకోవ‌డంతో ప‌లువురికి ఎస‌రు త‌ప్ప‌దా అన్న సందేహాలు క‌నిపిస్తున్నాయి. తాజా ప‌రిణామాల‌తో అధికార పార్టీలో కూడా ఊపు వ‌స్తున్న‌ట్టుక‌నిపిస్తోంది.

తాజాగా వైసీపీకి ఝ‌ల‌క్ ఇచ్చి సూప‌ర్ స్టార్ కృష్ణ సోద‌రుడు టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. వైసీపీ త‌రుపున గ‌తంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి, ఇటీవ‌ల కొంత సైలెంట్ గా ఉన్న జి ఆదిశేష‌గిరి రావు త్వ‌ర‌లో చంద్ర‌బాబుని క‌లిసి ప‌సుపు కండువా క‌ప్పుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే జ‌గ‌న్ కి నా ఆశీస్సులుంటాయ‌ని కృష్ణ ప్ర‌క‌టించ‌గా, ఆదిశేష‌గిరిరావు మాత్రం టీడీపీ వైపు చూడ‌డం ఆస‌క్తిగా మారింది. ఆది నుంచి టీడీపీ వ్య‌తిరేక కుటుంబం నుంచి ఇప్పుడు అటు మ‌ళ్లితే క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలో ఓ ముఖ్య‌నేత‌ను వైసీపీ కోల్పోయిన‌ట్ట‌వుతుంది.

ఇక బీజేపీ నుంచి కూడా ప‌లువురు నేత‌లు టీడీపీలో చేరే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. తాజాగా బీజేపీకి చెందిన రామ‌కోట‌య్య త‌న రాజీనామా స‌మ‌ర్పించారు. సైకిల్ ఎక్కుతున్న‌ట్టు సంకేతాలు ఇచ్చేశారు. మంచి వాక్యూతుర్యంక‌లిగిన రామ‌కోట‌య్య వంటి నేత‌లు టీడీపీకి అద‌న‌పు బ‌లాన్ని తీసుకొస్తార‌న‌డంలో సందేహం లేదు. సామాజికంగానూ రామ‌కోటయ్య రాక టీడీపీకి ఉత్సాహాన్నిస్తుంది. వారి బాట‌లోనే మ‌రికొంత‌మంది వివిధ పార్టీల నేత‌లు టీడీపీ క్యాంపు వైపు మొగ్గు చూపుతున్న‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. అంద‌రినీ అకామిడేట్ చేయ‌డ‌మే ఇప్పుడు చంద్ర‌బాబు క‌ర్త‌వ్యం.






Related News

మ‌ళ్లీ టీడీపీ, జ‌న‌సేన క‌ల‌యిక‌కి కార‌ణాలివే

Spread the loveచాలాకాలంగా ఏపీ రాజ‌కీయాల్లో తెలుగుదేశం తీరు మీద ఓ కామెంట్ ఉంది. చంద్ర‌బాబు ఒంట‌రిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కోలేర‌న్న‌దిRead More

ష‌ర్మిళ కేసులో టీడీపీ ఎంపీకి చిక్కులు త‌ప్ప‌వా?

Spread the loveష‌ర్మిళ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ ష‌ర్మిళ మీద టీడీపీ ఎంపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *