Main Menu

లోకేష్ ప్ర‌క‌ట‌న‌తో అఖిల‌ప్రియ‌కు అవ‌స్థ‌లు..

Spread the love

క‌ర్నూలు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ రాజేసిన మంట ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలా క‌నిపించ‌డం లేదు. అవ‌స‌రం లేని స‌మ‌యంలో టిక్కెట్లు ప్ర‌క‌టించి ఆయ‌న క‌ల‌క‌లం రేపారు. ఇప్ప‌టికే టీజీ వెంక‌టేష్ వంటి వారు బ‌హిరంగంగానే లోకేష్ ని ఛాలెంజ్ చేశారు. దాంతో టీడీపీ వ్య‌వ‌హారం ఆస‌క్తిగా మారుతోంది. అయితే క‌ర్నూలు ఎంపీ , ఎమ్మెల్యే అభ్య‌ర్థులను లోకేష్ కార‌ణంగా తాజాగా మంత్రి అఖిల‌ప్రియ అవ‌స్థ‌ల్లో ప‌డ్డ‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఆమె స‌మ‌స్య‌ల్లో ఇరుక్కున్న స‌మ‌యంలో సొంత అన్న‌గా చెప్పుకున్న లోకేష్ ఏం చేస్తార‌న్న‌ది చ‌ర్చ‌నీయాంశం అయ్యింది.

ఎన్నిక‌ల ముంగిట ఒకే కుటుంబానికి మూడు టిక్కెట్ల‌పై అభ్యంత‌రం వ‌స్తే చివ‌ర‌కు అది త‌న‌కు స‌మ‌స్య‌గా మారుతుంద‌ని గ్ర‌హించిన ఎస్వీ మోహ‌న్ రెడ్డి తొలుత త‌న టికెట్ ఖాయం చేసుకున్నార‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. ఇక మిగిలిన రెండు సీట్ల విష‌యంలో ఆళ్ల‌గ‌డ్డ‌, నంద్యాల వ్య‌వ‌హారం ఇప్పుడు తెర‌మీద‌కు వ‌స్తోంది. భూమా అఖిల‌ప్రియ‌కు ఆళ్ల‌గ‌డ్డ‌, బ్ర‌హ్మానంద‌రెడ్డికి నంద్యాల కేటాయించ‌డం సాధ్యం కాద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఆళ్ల‌గ‌డ్డ కోసం ఏవీ సుబ్బారెడ్డి. నంద్యాల కోసం ఎస్పీవై రెడ్డి కుటుంబీకులు కాచుకుని కూర్చుకున్నారు. దాంతో ఎస్వీ మోహ‌న్ రెడ్డితో పాటుగా మ‌రొక‌రికి మాత్ర‌మే అవ‌కాశం అంటే ఎవ‌రికి ఎస‌రు వ‌స్తుందోన‌నే అనుమానం బ‌య‌లుదేరింది.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అఖిల‌ప్రియ నంద్యాల పార్ల‌మెంట్ సీటుకి బ‌రిలో దిగాల‌నే ప్ర‌తిపాద‌న ఉంది. అదే జ‌రిగితే త‌న చెల్లెలు మౌనిక‌కు ఆళ్ల‌గ‌డ్డ అప్ప‌గించాల‌ని ఆమె కోరుతున్నారు. దాంతో మూడో సీటే అనుమానం అంటుంటే అఖిల‌ప్రియ ఏకంగా నాలుగోస్థానం గురించి మాట్లాడుతుంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో క‌ర్నూలు వ్య‌వ‌హారం హాట్ టాపిక్ గా మారుతోంది. తెలుగుదేశంలో కొత్త త‌గాదాని తెర‌మీద‌కు తెచ్చేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే కేఈ కుటుంబానికి రెండు సీట్లు దాదాపు ఖాయం అనే వాద‌న ఉంది. దానికి తోడు అఖిల‌ప్రియ ఫ్యామిలీకి మూడు సీట్లు అంటే స‌గం సీట్లు ఇద్ద‌రు మంత్రుల కుటుంబీకుల‌కే కేటాయించిన‌ట్ట‌వుతుంది. అది ఏమేర‌కు సాధ్య‌మ‌వుతుంద‌న్న‌ది చూడాల్సి ఉంది.






Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the love499Sharesజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *