రావెల తర్వాత టీడీపీలో అమాత్యుడికి పొగ

రావెల కిషోర్ బాబు..ఈయన మంత్రిగా ఉన్నంతకాలం వివాదాలే. అందులోనూ సొంత పార్టీ నేతలతో చిక్కులే. ఇంకా చెప్పాలంటే ఒక సామాజికవర్గం నాయకులతో రావెల కి అసలు పొసిగేది కాదు. నిత్య తగాదాలతో రావెల పేరు వార్తల్లో ఉండేది. కొన్ని ఆయన కారణంగా వివాదాలయితే మరికొన్ని ఆయన శైలి నచ్చని వాళ్లు సృష్టించిన సమస్యలుగా ఉండేవి. చివరకు రావెలకు మంత్రి పదవి పోయింది. ఆయన పార్టీని వీడాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. అదంతా ఈ విబేధాల వల్లేనని చెప్పక తప్పదు.
ఆ తర్వాత రావెల కోటాలో మంత్రి పదవి దక్కించుకున్న కేఎస్ జవహార్ కి కూడా ఇప్పుడు దాదాపుగా అలాంటి పరిస్థితి దాపురిస్తోంది. పార్టీని వదిలివెళ్లే అవకాశం లేకపోయినప్పటికీ జవహార్ ని కొవ్వూరు నుంచి ఆయన సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా తిరువూరికి తరలిపోయేందుకు తగ్గట్టుగా కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారనే వాదన బయలుదేరింది. ముఖ్యంగా టీడీపీకి ఆపార్టీ ఆవిర్భావం తర్వాత కేవలం ఒకే ఒక్కసారి మినహా అన్ని సార్లు విజయం అందించిన కొవ్వూరులో ఎక్సైజ్ మంత్రి వ్యవహారశైలి పట్ల పలువురు టీడీపీ నేతలు ఫిర్యాదులు ప్రారంభించారు. ఇప్పటికే ఎంపీ మురళీమోహన్, జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతామహలక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. త్వరలో లోకేష్ పర్యటన సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించే అవకాశం లేకపోలేదని కూడా చెబుతున్నారు.
గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటి కంటే ఇప్పుడు మంత్రిగా అందరి మీద పెత్తనం చేసేందుకు జవహార్ ప్రయత్నించడాన్ని పలువురు సహించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన పొమ్మనలేక పొగ పెట్టే రీతిలో పలువురు నేతలు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇటీవల ద్వారకాతిరుమల వరకూ జవహార్ చేసిన పాదయాత్రకు కూడా పలువురు స్థానిక టీడీపీ కీలక నేతలు సహకరించలేదు. అంతటితో సరిపెట్టకుండా టీడీపీ కార్యకర్తల వనభోజనాల కార్యక్రమానికి మంత్రిని ఆహ్వానించకుండా జరుపుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తొలుత చాగల్లు మండలంలో మొదలయిన ఈ సెగ ఇప్పుడు కొవ్వూరులో కాక రాజేస్తోంది.
వచ్చే ఎన్నికల్లో ఆయనుండాలో, మేముండాలో తేల్చుకోవాలంటూ కొందరు నేతలు అల్టిమేటం జారీ చేస్తుండడంతో కొవ్వూరు టీడీపీ వ్యవహారాలు రోడ్డునపడుతున్నట్టు కనిపిస్తోంది . మంత్రి అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయిన ఫలితంగా ఇటీవల కొవ్వూరు మునిసిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం వ్యవహారంలో జవహార్ పాత్రను పలువురు తప్పుబడుతున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న అమాత్యుడిని ఇక సహించలేమని చెబుతున్నారు. ఈ పరిణామాలతో కంచుకోట లాంటి నియోజకవర్గంలో టీడీపీ హవాకు బ్రేకులు పడే ప్రమాదం కనిపిస్తోందని సమాచారం.
Related News

చంద్రబాబు అభ్యర్థుల కసరత్తు లక్ష్యం నెరవేరేనా?
Spread the loveఏపీలో తెలుగుదేశం పార్టీ గతానికి భిన్నంగా వ్యవహరిస్తోంది. చివరి నిమిషం వరకూ ఊరించి, నామినేషన్ల గుడువు ముగిసిపోయేRead More

టీడీపీని వీడబోతున్న మూడో ఎంపీ ఆయనే..!
Spread the loveగోదవరి జిల్లాల తెలుగుదేశం రాజకీయాల్లో తోట బ్రదర్స్ తలనొప్పిగా తయారయ్యారు. ఇప్పటికే తోట త్రిమూర్తులు తన పార్టీRead More