పవన్ కళ్యాణ్ పై మళ్లీ కత్తిదూశాడు…!

Its-Not-Jana-Sena--Kapu-Sena--Kathi-Mahesh-1512798570-1316
Spread the love

గడిచిన కొన్నాళ్లుగా కాస్త చల్లారిన కత్తి మహేష్ మళ్లీ కత్తిదూశాడు. మరోసారి పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డాడు. ఈసారి జనసేనానిని అవినీతిపరుడిగా వ్యాఖ్యానించి సంచలనం స్రుష్టించాడు. తాజాగా సొంత ఇంటికోసం అమరావతిలో శంకుస్థాపన నిర్వహించిన పవన్ కళ్యాణ్ మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్వీట్లతో మరోసారి దాడి మొదలెట్టారు.

తాజాగా పవన్ కళ్యాణ్ అందరికీ అందుబాటులో ఉండడం కోసమంటూ అమరావతికి సమీపంలో రెండెకరాల స్థలంలో ఇల్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దాని మీద పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గతంలో తనకు డబ్బులు లేవని, కార్ కూడా అమ్మేసుకున్నానని వ్యాఖ్యలు చేసిన పవన్ హఠాత్తుగా భారీ ఇల్లు కట్టడం విస్మయకరంగా మారింది. దాంతో కత్తి మహేష్ తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారింది. జనసేన కార్యకర్తలు దుమ్మెత్తిపోయడం ప్రారంభించడంతో ట్విట్టర్ లో వైరం మొదలయ్యింది.

కత్తి మహేష్ ట్వీట్లు ఇవే..!

“ఐరవై రెండు ఏళ్ల సినీప్రస్థానంలో సొంత ఇళ్ళు అమ్ముకోవడం. కారు వాయిదాలు కట్టుకోలేక అమ్మేయడాలే తెలిసిన పవన్ కళ్యాణ్. అతికొద్ది రాజకీయ ప్రయాణంలో ప్రపంచస్థాయి అతి కాస్ట్లీ అమరావతిలో సొంత ఇల్లు, సొంత ఆఫీసు కట్టుకునే స్థాయికి చేరడం ఆదర్శనీయం.”

“జనసేన పార్టీ ఆరంభంలోనే బానిసత్వం ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయ పంథాలోనే జీహుజురి ఉంది. పార్టీ ఆఫీస్ నిర్మాణపు పునాదిలోనే అవినీతి ఉంది. ఇది మార్పు కోసం వస్తున్న రాజకీయం కాదు. ఏమార్చడానికి కొనసాగుతున్న పవనిజం.”

“పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన ల్యాండ్ డీల్ నాకు ఇస్తే, పవన్ కళ్యాణ్ పక్కన ప్లాట్ తీసుకుని అమరావతి షిఫ్ట్ అవ్వడానికి నేను రెడీ!”

“మాదాసు గంగాధరం మరియు రాఘవయ్య లాంటి యువనాయకత్వం జనసేన ఆవిర్భావసభ ఏర్పాట్లు చూసుకోవడం ముదావహం. పవన్ కళ్యాణ్ కి అభినందనలు.”


Related News

Vijay-Sai-Reddy-Controversi

విజ‌య‌సాయిరెడ్డి మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveటీడీపీ రూటు మార్చింది. వైఎస్ జ‌గ‌న్ తో పాటుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో కూడా సీరియ‌స్Read More

Nara-and-Pawan

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కేసు!

Spread the loveటీడీపీ అనూహ్యంగా స్పందిస్తోంది. త‌న మాజీ మిత్ర‌ప‌క్షం నాయ‌కుడు ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దానికిRead More

 • వైసీపీ ఎంపీల రాజీనామాలు
 • పవన్ కళ్యాణ్ పై మళ్లీ కత్తిదూశాడు…!
 • వైసీపీ ఇంకెప్పుడు నేర్చుకుంటుందో..!
 • బాబుకి మోడీ స‌మాధానం ఎలా ఉంటుంది?
 • క‌మ‌లంలో కాక రాజుకుంది..
 • వైసీపీ ఓ అడుగు వేసిన‌ట్టే..
 • చంద్ర‌బాబుకి, కేసీఆర్ కి తేడా అదే!
 • హోదాతో ప‌నేముందిక‌…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *