బాబు ధర్మపోరాటంపై నీళ్లుజల్లిన బీజేపీ ఎంపీ

బాబు ధర్మపోరాటం ఫలితం ఒకే ఒక్క కారణంతో నీరుగారిపోయేలా కనిపిస్తోంది. అందుకు బీజేపీ ఎంపీ కారణం కావడం విస్మయకరంగా ఉంది. టీడీపీ నేతలతో కలిసి బీజేపీ ఎంపీ ఢిల్లీ బయలుదేరడం ఇప్పుడు దుమారం రేపుతోంది. దాంతో విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు తీరు ఇప్పుడు రాజకీయ రచ్చకు దారితీస్తోంది.
బీజేపీ-టీడీపీ రహస్య కాపురం గుట్టు రట్టైందని వైసీపీ విమర్శించేందుకు ఇదో అవకాశంగా కనిపిస్తోంది. పబ్లిగ్గా దుమ్మెత్తి పోసుకుంటూ.. ప్రైవేట్‌గా కొనసాగిస్తున్న ప్రేమాయణమంటూ ఆపార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ధర్మపోరాట దీక్ష కోసం ఢిల్లీకి టీడీపీ నేతలు ఎక్కిన ప్రత్యేక విమానంలో బీజేపీ ఎంపీ హరిబాబు ప్రత్యక్షం కావడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. . ఈ ఫొటోలను విజయసాయిరెడ్డి షేర్ చేస్తూ బీజేపీ-టీడీపీ అక్రమ సంబంధానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. దాంతో బాబు పోరాట ఫలితం నీరుగారిపోయే ప్రమాదం దాపురించింది.
ధర్మ పోరాట దీక్షల పేరుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న చంద్రబాబు నాయుడిని ప్రజలు గమనిస్తున్నారని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. ధర్మపోరాట దీక్షలతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న చంద్రబాబు రూ. 200 కోట్ల ప్రజాధనాన్ని తిరిగి చెల్లించక తప్పదన్నారు. ఎవరి సొమ్మని పచ్చ కుల మీడియాకు వేల కోట్లు దోచి పెడుతున్నారని మండిపడ్డారు. సొంత పనులకు హెలికాప్టర్, విమాన ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని హెచ్చిరించారు.
మరో ట్వీట్లో లోకేష్ బాబుకి ఇండిపెండెన్స్ డేకు రిపబ్లిక్ డేకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కట్టబెట్టినా చంద్రబాబుకూ చిట్టి నాయుడిపై ఏమాత్రం నమ్మకం లేదన్నారు. అందుకే తెలంగాణా ఎన్నికల్లో సరిహద్దు దాటకుండా గీతగీశాడని గుర్తు చేశారు. కానీ దోచుకోవడంలో మాత్రం లోకేష్ తండ్రి శిక్షణలో రాటు తేలాడని, ఇందులో A గ్రేడ్ ఇవ్వక తప్పుదని అభిప్రాయపడ్డాడు.
అదే సమయంలో కంభంపాటి హరిబాబు ఫోటో మాత్రం హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన ఈ విశాఖ ఎంపీ వెంకయ్య శిష్యుడిగా గుర్తింపు ఉంది. చంద్రబాబుకి సన్నిహితుడిగా స్పష్టమవుతోంది. గతంలో గానీ,ఇప్పుడు గానీ చంద్రబాబు మీద విమర్శలకు దిగేందుకు ఆయన పెద్దగా ప్రయత్నించిన దాఖలాలు లేవు. అదే సమయంలో సీబీఎన్ తో మాత్రం సన్నిహితంగా మెలిగేందుకు ప్రయత్నిస్తుంటారనే ముద్ర ఉంది. అందులో భాగంగా నేరుగా మోడీ వచ్చి బాబుకి గట్టి షాక్ ఇచ్చిన తర్వాత 24 గంటలు గడవకముందే ఆయన టీడీపీ నేతలతో కలిసి మోడీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న ధర్మపోరాట దీక్షకు బయలుదేరడం కమలనాధులకు కూడా రుచించే అవకాశం లేదు.
Related News

చంద్రబాబు చేతులెత్తేసినట్టేనా?
Spread the loveఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒకవైపు వరుసగా సంక్షేమ పథకాలతో జనాలను ఆకట్టుకుంటున్నప్పటికీ మరోవైపు సొంతRead More

బాబుకి గట్టి షాక్
Spread the loveఏపీ సీఎం చంద్రబాబుకి గట్టి షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా రాజకీయాల్లో పెను మార్పులు ఖాయంగా మారుతోంది.Read More