వైసీపీకిది గుణపాఠమే!

1736_ysrcp
Spread the love

వైసీపీలో అంతర్మథనం మొదలయ్యింది. ఓటమి తర్వాత కాకినాడలో ఆపార్టీ కార్యకర్తలు ఢీలా పడ్డారు. సుదీర్ఘకాలంగా టీడీపీకి చోటులేని చోట ప్రత్యర్థి ముందు తలవంచాల్సి రావడం వైసీపీ శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది. ఓటమి కూడా ఊహించిన దానికి భిన్నంగా భారీ తేడాతో ఎదుర్కోవాల్సి రావడడం వారిని ఇబ్బందికి గురిచేస్తోంది. కారణాలను అన్వేషిస్తూ ఆపార్టీ నేతలు కుస్తీ పడుతున్నారు.

తీవ్రమైన ప్రజావ్యతిరేకత…కాపుల్లో పెల్లుబికుతున్న ఆగ్రహం…స్మార్ట్ సిటీ నిధుల మాటే లేకపోవడం అన్నీ కలిసి తమకే విజయం దక్కుతుందని వైసీసీ ఆశించింది. కాకినాడ కిరీటం దక్కించుకుంటామని కలలు గన్నది. కానీ చివరకు ఫలితాలు తారుమారయ్యాయి. ఈవీఎంలు తెరిచిన తర్వాత వైసీసీ పరిస్థితి దయనీయంగా కనిపించింది. ఒకదశలో సిింగిల్ డిజిట్ తో సరిపెట్టుకుంటారా అని సందేహించినప్పటికీ చివరకు 10 స్థానాలతో సంత్రుప్తి చెందాల్సి వచ్చింది.

దాంతో 48 సీట్లకు జరిగిన ఎన్నికల్లో కేవలం 10 స్థానాలు మాత్రమే దక్కడం విపక్ష పార్టీ శ్రేణుల్లో తీవ్రంగా వేధిస్తోంది. ఓటమికి కారణాలపై పలు రకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ పార్టీ నేతల్లో సఖ్యత లేకపోవడం పెద్ద సమస్యగా మారింది. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇన్చార్జ్ గా ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు కన్నబాబు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం పార్టీని కలవరపాటుకి గురిచేస్తోంది. ఆయన నియోజకవర్గం పరిధిలో సైకిల్ జోరు కనిపించింది. చివరకు కన్నబాబు నివాసం ఉంటున్న డివిజన్ కూడా టీడీపీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంది. రూరల్ లో ఉన్న 6 డివిజన్లకు గానూ కేవలం ఒకే ఒక్క స్థానం వైసీపీకి దక్కడం విశేషం.

ఇక నగరంలో కూడా ఇద్దరు కోఆర్డినేటర్లు ఎవరి దారి వారిదే అన్నట్టుగా వ్యవహరించారు. అభ్యర్థుల ఎంపిక నుంచి అన్నింటా వివాదాలతో సాగిపోయారు. దాంతో సఖ్యత లేని సంసారం చివరకు చేటు తెచ్చినట్టు కనిపిస్తోంది. చేతులు కాల్చుకోక తప్పని స్థితి దాపురించింది. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. మాజీ మంత్రి ముత్తా తనయుడు ముత్తా శశిధర్ మధ్య విబేధాలు వైసీసీ కొంప మునగడానికి దోహద పడ్డాయి. గట్టి పోటీ ఉన్న చోట ఐక్యంగా పనిచేసి ఉంటే గట్టెక్కే అవకాశాలున్నప్పటికీ చివరకు పరాజయం మూటగట్టుకోవాల్సి రావడానికి పార్టీ నేతల మధ్య అనైక్యతే కారణమని అనేకమంది భావిస్తున్నారు.

అదే సమయంలో వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంలో విఫలం అయ్యింది. కీలక సామాజికవర్గాలను కూడా తనవైపు తిప్పుకోవడానికి ఉన్న అవకాశాలను విడిచిపెట్టింది. దాంతో కాపులతో పాటు చివరకు ఎస్సీలు కూడా టీడీపీవిజయంలో కీలకంగా వ్యవహరించారు. ప్రచారం, పోల్ మేనేజ్ మెంట్ లో టీడీపీ ఓ పక్కా పథకం ప్రకారం సాగినప్పటికీ వైసీపీ మాత్రం సమన్వయలోపంతో గందరగోళంగా కనిపించింది. విజయసాయిరెడ్డి వంటి వారు స్వయంగా రంగంలో దిగి శ్రమించినా మిగిలిన నేతల తీరు ఆపార్టీని నిరాశలో ముంచింది. దాంతో వైసీపీకి ఓటమి తప్పలేదని పలువురు భావిస్తున్నారు.

ఎమ్మెల్యే తనయుడిని ఓడించడం, బీజేపీ జిల్లా అధ్యక్షుడిని చిత్తుచేయడం వంటి కొన్ని సానుకూల ఫలితాలు సాధించినప్పటికీ అసలు లక్ష్యానికి దూరంగా ఉండిపోయిన నేపథ్యంలో పార్టీలో దిగులు మొదలయ్యింది. ప్రస్తుతం జరిగిన తప్పులు సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో కూడా పెను నష్టం తప్పదని అర్థమవుతోంది.


Related News

chandrababu-naidu-and-SomuV

వీర్రాజు నోట జైలు మాట‌….

Spread the loveప్ర‌త్యేక హోదా పేరుతో త‌మ‌ను బ‌ద్నాం చేస్తున్న చంద్ర‌బాబుకి బ్రేకులు వేయాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికిRead More

jayaprakash narayan

జేపీకి అది ద‌క్కుతుందా?

Spread the love2Sharesలోక్ స‌త్తా అధినేత చూపులు హ‌స్తిన వైపు మ‌ళ్లాయి. ఢిల్లీ రాజ‌కీయాల వైపు ఆయ‌న చూస్తున్నారు. కానీRead More

 • హీరో శివాజీపై బీజేపీ దాడి
 • బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!
 • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
 • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *