టీడీపీ వ‌ద్దంటోంది…వైసీపీ రావాలంటోంది..!

tdp
Spread the love

ఆశ్చ‌ర్య‌మే కానీ ఆస‌క్తిదాయ‌క ప‌రిణామం. ఇప్ప‌టికే నంద్యాల‌లో డ‌బ్బు సంచులు వెద‌జ‌ల్లుతున్నారు. మూట‌ల కొద్దీ క‌ట్ట‌లు నంద్యాల వీధుల్లో చేతులు మారుతున్నాయ‌న్న‌ది కాద‌న‌లేని స‌త్యం. అధికార‌యుతంగా 1200 కోట్ల నిధులు కేటాయించి ఓటేస్తేనే అవ‌న్నీ పూర్త‌వుతాయ‌నే ప్ర‌చారానికి టీడీపీ నేత‌లు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇక దానికి కొన‌సాగింపుగా ఇప్పుడు కాకినాడ‌లోనూ కాక రాజుకోవ‌డం ఖాయ‌మ‌నే వాద‌న ఉంది. చాలాకాలంగా వాయిదాప‌డుతూ వ‌స్తున్న కాకినాడ మునిసిప‌ల్ కార్పోరేషన్ ఎన్నిక‌ల క‌ల‌క‌లం మొద‌ల‌య్యింది. ఇక్క‌డ కూడా పాల‌క‌ప‌క్షం అదే రీతిలో వెళ్లి స్థానిక సంస్థ‌ను కూడా త‌న ఖాతాలో వేసుకునే అవ‌కాశం ఉంది.

కానీ ఇక్క‌డ అనూహ్యంగా కాకినాడ కార్పోరేష‌న్ ఎన్నిక‌ల‌ను టీడీపీ జీర్ణించుకోలేక‌పోతోంది. మూడున్న‌రేళ్లుగా వాయిదాలేస్తూ వ‌స్తున్న‌ప్ప‌టికీ చివ‌ర‌కు కోర్టు ధిక్కారం కింద న్యాయ‌మూర్తులు క‌న్నెర్ర చేయడంతో నోటిఫికేష‌న్ త‌ప్ప‌లేదు. అందులో ప‌లు లోటుపాట్లు ఉన్న‌ప్ప‌టికీ నామినేష‌న్ల ప్ర‌క్రియ మాత్రం ప్రారంభ‌మ‌య్యింది. అయినా తెలుగుదేశం మాత్రం ఎన్నిక‌ల్లో పోటీకి సిద్దం కాలేక‌పోతోంది. ఏదో ర‌కంగా ఎన్నిక‌ల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తుంది. ఎన్నిక‌లు జ‌రిగితే అనూహ్యమైన ప‌రిణామాల‌కు ఆస్కారం ఉంద‌న్న స‌మాచారంతోనే టీడీపీ వెన‌క‌డుగు వేస్తుంద‌నే ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే కాకినాడ ఎమ్మెల్యే అనుచ‌రులు సుప్రీంకోర్ట్ వ‌ర‌కూ వెళ్లి ఎన్నిక‌ల వాయిదా కోసం చేస్తున్న ప్ర‌య‌త్నాలు దానికి నిద‌ర్శ‌నంగా ఉన్నాయి.

ముఖ్యంగా కాకినాడ‌లో టీడీపీ త‌గాదాలు అన్నీ ఇన్నీ కావు. ఎమ్మెల్యేకి, ఎంపీ కి ప‌డ‌దు. ఎంపీకి మంత్రి కి గిట్ట‌దు. ఎమ్మెల్యే వెనుక చ‌క్రం తిప్పుతున్న ఆయ‌న సోద‌రుడికి ఇత‌ర టీడీపీ నేత‌ల‌కు మ‌ధ్య స‌ఖ్య‌త లేదు . ఇలాంటి అనేక స‌మ‌స్య‌లు టీడీపీలో తీవ్రంగా ఉన్నాయి. దాంతో ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్క‌డం త‌ల‌కుమించిన భార‌మ‌ని భావిస్తోంది. ఎన్నిక‌లు వాయిదా వేస్తే ప్ర‌య‌త్నం చేస్తోంది.

అదే స‌మ‌యంలో వైసీపీ మాత్రం ఉవ్విళ్లూరుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. వాయిదా ప‌డాల‌ని విప‌క్షంలోని కొంద‌రు ఆశిస్తున్నా పార్టీగా మాత్రం అభ్య‌ర్థుల ఎంపిక‌లో త‌ల‌మున‌క‌లై ఉంది. ఇప్ప‌టికే నామినేష‌న్లు వేసిన వారిలో వైసీపీ అభ్య‌ర్థులుండ‌డం విశేషం. దాంతో కార్పోరేష‌న్ ఎన్నిక‌ల విష‌యంలో నైతికంగా వైసీపీ ఓ అడుగు ముందుకు వెళుతుందా అన్న చ‌ర్చ సాగుతోంది. టీడీపీ మాత్రం మేయ‌ర్ అభ్య‌ర్థి విష‌యంలోనూ మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతోంది. రాజ‌మ‌హేంద్ర‌వ‌రం సీటును కాపుల‌కు కేటాయించారు కాబ‌ట్టి మేయ‌ర్ సీటు త‌మ‌కే ఇవ్వాల‌ని వైశ్యులు ప‌ట్టుబ‌డుతున్నారు. అదే జ‌రిగితే అస‌లే దూరంగా ఉన్న కాపులు మ‌రింత దూర‌మ‌యిపోతార‌న్న ఆందోళ‌న టీడీపీలో క‌నిపిస్తోంది. ఏతావాతా ఎటుచూసినా ప‌రిణామాలు ఎటుదారితీస్తాయోన‌న్న ఆందోళ‌న మాత్రం అధికార పార్టీలో కనిపిస్తోంది. వైసీపీకి అదే బ‌లంగా మారుతోంది.


Related News

association-international-dharamsala-sportzpics-himachal-celebrates-2017photo_aac8ae6c-dd73-11e7-8585-db66518b106f

శ్రీలంకకు ఊరట విజయం

Spread the loveమూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో భారత్‌పై లంక ఘన విజయంRead More

nara lokesh

నారా వారి లెక్కలు మామూలుగా లేవు..

Spread the loveముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి కుమారుడు, రాష్ట్ర మంత్రి లోకేశ్‌ తాజాగా ప్రకటించిన ఆస్తుల వివరాల్లో మాయాజాలం చోటుచేసుకుంది. ఎంఎల్‌సిగాRead More

 • బాబు భవితవ్యం తేల్చేసిన పవన్
 • నేను అనుకూలం..వ్యతిరేకం కాదు
 • పవన్ కల్యాణ్ మాట మీద నిలబడాలి…
 • చంద్రబాబు జైలుకే..
 • కాపులకు ఇది వరమా..కలవరమా?
 • తమ్ముళ్ల తీరుతో తల పట్టుకుంటున్న చంద్రబాబు
 • పోలవరం ఆపేస్తాం:చంద్రబాబు నిర్వేదం
 • జగన్, జ్యోతిలక్ష్మీ ఒకటే అంటున్న జేసీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *