Main Menu

ఆరంభంలోనే జేడీ ఢీలా!

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌నం సృష్టిస్తార‌ని ఆశిస్తే చివ‌ర‌కు ఆయ‌న అభిమానుల‌ను కూడా గంద‌ర‌గోళంలో ముంచారు. సొంతంగా పార్టీ పెడ‌తార‌ని తొలుత ప్ర‌క‌టించి, జ‌న‌ధ్వ‌ని అంటూ ఊహాగానాల‌కు అవ‌కాశం ఇచ్చి, ఆఖ‌రికి లోక్ స‌త్తా లో విలీనం అయ్యే ప‌రిస్థితి నుంచి వెన‌క్కి రావ‌డం గ‌మ‌నిస్తే వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ పార్టీ ఊహించిన‌ దానికి భిన్నంగా మారింది.

మాజీ సీవిల్స్ జయ‌ప్ర‌కాష్ నారాయ‌ణ త‌ర్వాత ఏపీ రాజ‌కీయాల్లో అడుగుపెట్టిన మ‌రో మాజీ అధికారి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయ‌ణ రాజ‌కీయ ప్ర‌వేశం ఆస‌క్తి రాజేసింది. జేపీ విఫ‌లం కావ‌డంతో జేడీ ప్ర‌భావం ఎలా ఉంటుందోన‌నే చ‌ర్చ సాగింది. సొంత పార్టీతో ఏమేర‌కు స‌త్తా చాట‌గ‌ల‌ర‌నే విష‌యంలో ఊహాగానాలు వినిపించాయి. ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు సాగాయి.

అయితే చివ‌ర‌కు జేడీ ఆరంభం త‌డ‌బ‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ అభిమానుల‌ను సైతం నిరాశ‌ప‌రిచింది. చివ‌ర‌కు ఈయ‌న మీద ఆశ‌లు పెట్టుకున్న వాళ్ల‌లో కూడా అసంతృప్తి మిగులుస్తోంది. జ‌న‌సేన తో క‌లుస్తార‌ని భావించిన తొలి నాళ్ల‌లో జేడీ కి అండ‌గా నిలిచిన జ‌న‌సైనికులు, లోక్ స‌త్తా క‌లుస్తార‌ని ప్ర‌క‌ట‌న రాగానే లోక్ సత్తా శ్రేణులు అండ‌గా నిల‌వ‌గా, తాజాగా అన్ని త‌ర‌గ‌తుల్లోనే జేడీ క్రేజ్ నీరుగారిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. రాజ‌కీయంగా ఆయ‌న ప్ర‌భావం తేలిపోయే ప‌రిస్థితులు దాపురిస్తున్న‌ట్టు భావిస్తున్నారు. ఇక అంతిమంగా సొంత పార్టీకి సిద్ధ‌ప‌డుతున్న జేడీకి ఏమేర‌కు మ‌ద్ధ‌తు ద‌క్కుతుంద‌నే విష‌యంలో సందిగ్ధం పెరుగుతోంది.






Related News

వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌లో మ‌రో నెంబ‌ర్ తోడ‌య్యింది. వాస్తవానికి అధికారికంగా 67మందిని గెలిపించుకున్న ఈRead More

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the loveత్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *