రంగంలోకి జేసీ సన్స్

30-1480481701-jc-diwakar-prabhakar-645
Spread the love

ఏపీ రాజకీయాల్లో జేసీ బ్రదర్స్ ది విలక్షణ తీరు. నిత్యం నోటికి పని చెప్పి తమ పనులు పూర్తి చేయించుకోవడంలో సిద్ధహస్తులు. ఎప్పుడు చంద్రబాబుని పొగుడుతారో..ఏ రీతిలో విమర్శిస్తారో చివరకు ఆ పార్టీ అదినేతకు కూడా అర్థం కాని రీతిలో ఉంటుంది వారి వైఖరి. అందుకే జేసీ బ్రదర్స్ అంటే రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటారు.

అయితే వచ్చే ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. ఆయన స్థానంలో తనయుడిని అనంతపురం పార్లమెంట్ స్థానం నుంచి రంగంలో దింపే ఆలోచన చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయం చంద్రబాబు ద్రుష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దాంతో జూనియర్ జేసీగా పవన్ కుమార్ రెడ్డి ప్రస్థానం ప్రారంభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వాస్తవానికి గడిచిన ఎన్నికల్లోనే పవన్ పొలిటికల్ ఎంట్రీ కోసం తహతహలాడారు. తనకు మిత్రుడిగా ఉన్న జగన్ తో చేతులు కలపాలని చూశారు. కానీ చివరి నిమిషంలో కథ మారిపోవడంతో తెలుగుదేశంలోకి వచ్చారు. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బరిలో ఉండడానికి పవన్ తీవ్రంగా ఆసక్తి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తోంది.

పవన్ కి తోడుగా జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ కూడా ఆత్రుతగా కనిపిస్తున్నారు. తాడిపత్రి నుంచి అస్మిత్ ని తెరమీదకు తీసుకురావాలని ప్రభాకర్ రెడ్డి పథక రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో వచ్చే ఎన్నికల్లో ప్రస్తుతం అన్నదమ్ములు పోటీ చేస్తున్న రెండు సీట్ల నుంచి వారసులు రంగంలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభాకర్ రెడ్డి గుంతకల్లు మీద కన్నేసినట్టు కనిపిస్తోంది. గుత్తి కోసం ఆయన కుస్తీ పడుతున్నారనే సమాచారం చాలా చోట్ల వినిపిస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి మాత్రం రాజ్యసభ ఆశతో ఉన్నారనే చెబుతున్నారు.

దాంతో ప్రస్తుతం ఇద్దరున్న జేసీ ఫ్యామిలీ నుంచి డబుల్ కావాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది. మరి నాలుగు స్థానాలను ఆ నాయకులకు కేటాయిస్తారో లేదో చూడాలి. ఇప్పటికే జేసీ అల్లుడు దీపక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న విషయం కూడా తెలిసిందే.


Related News

jdlakshminarayana11521726505

జేడీ ఆ కండువా క‌ప్పుకుంటారా?

Spread the love8Sharesజేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. జ‌గ‌న్ కేసుల పుణ్యాన మంచి క్రేజ్ సంపాదించారు. ఓ పోలీస్ విచార‌ణాధికారిగా ఉన్న వ్య‌క్తికిRead More

Vijay-Sai-Reddy-Controversi

విజ‌య‌సాయిరెడ్డి మీద గురిపెట్టిన టీడీపీ

Spread the love9Sharesటీడీపీ రూటు మార్చింది. వైఎస్ జ‌గ‌న్ తో పాటుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో కూడా సీరియ‌స్Read More

 • ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కేసు!
 • వైసీపీ ఎంపీల రాజీనామాలు
 • పవన్ కళ్యాణ్ పై మళ్లీ కత్తిదూశాడు…!
 • వైసీపీ ఇంకెప్పుడు నేర్చుకుంటుందో..!
 • బాబుకి మోడీ స‌మాధానం ఎలా ఉంటుంది?
 • క‌మ‌లంలో కాక రాజుకుంది..
 • వైసీపీ ఓ అడుగు వేసిన‌ట్టే..
 • చంద్ర‌బాబుకి, కేసీఆర్ కి తేడా అదే!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *