Main Menu

పవన్ కి అడ్డంకిగా మారిన జగన్!

Spread the love

ఇదో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఏపీలో ఇద్దరు ప్రతిపక్ష నేతల మధ్య ఎన్నికల నాటికి అవగాహన ఖాయమనే వాదన పలువురు ముందుకు తెస్తున్నారు. ఉమ్మడి ప్రత్యర్థిని ఓడించేందుకు ఒక్కటవుతారనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ, జనసేన చేతులు కలపవచ్చనే ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ పర్యటనకు వైఎస్ జగన్ అడ్డంకిగా మారినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బహిరంగంగా ప్రకటించకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ పర్యటనకు మధ్యలో బ్రేక్ రావడానికి అసలు కారణం జగన్ అనే చెబుతున్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రజా పోరాట యాత్రకు కొద్దిరోజులు విరామం ప్రకటించారు. వ్యక్తిగత సిబ్బందిలో ఎక్కువమంది ముస్లింలు ఉండటంతో రంజాన్‌ పండుగను దృష్టిలో ఉంచుకొని ఈ విరామం ఇచ్చినట్టు ప్రకటించారు. రంజాన్‌ అనంతరం యాత్ర విశాఖ జిల్లాలోనే ప్రారంభించబోతున్నట్టు చెబుతున్నారు. పవన్‌ భీమిలి బీచ్‌రోడ్డులోని సాయిప్రియ రిసార్ట్‌లో రెండు రోజులుగా పవన్ బస చేశారు.

విశాఖకు చెందిన కొంతమంది మేధావులతో ఆయన సమావేశమయ్యారు. మాజీ వైస్‌ చాన్సలర్‌ కేఎస్‌ చలం తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఆది, సోమవారాలలో వివిధ వర్గాలవారితో పవన్‌ చర్చించనున్నారని జనసేన ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. జనసైనికులకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు వివరించారు. సోమవారం సాయంత్రం పవన్‌ విశాఖ నుంచి హైదరాబాద్‌ బయలుదేరుతారు. అయితే వాస్తవంగా పవన్ పర్యటనలో భాగంగా విశాఖ తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో అడుగుపెట్టాల్సి ఉంది. కాకినాడ సెజ్ ప్రాంతంలో జనసేనాని పర్యటన చర్చనీయాంశం అయ్యింది.

అయితే అనూహ్యంగా పవన్ తన పర్యటనను వాయిదా వేసుకోవడం, దానికి రంజాన్ కారణంగా చెప్పడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయినా అసలు కారణం మాత్రం తూర్పు గోదావరి జిల్లాలో జగన్ పర్యటనకు ఏర్పాట్లు సాగుతుండడమేనని చెబుతున్నారు. ఏక కాలంలో జగన్, పవన్ ఒకే జిల్లాలో పర్యటించడం వల్ల పోటీ వాతావరణం ఏర్పడుతుందని, జనసమీకరణ సహా అన్ని విషయాల్లోనూ ప్రజలు ఇరువురిని పోల్చుకుంటారని భావిస్తున్నారు. దానివల్ల కొత్త సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అలాంటి పరిస్థితులకు అవకాశం లేకుండా జనసేన తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే ఈ వాయిదా తాత్కాలికమేనని జనసేన చెబుతోంది.






Related News

జ‌గ‌న్ కేసులో చంద్ర‌బాబుకి షాక్

Spread the loveఏపీ సీఎం కి షాక్ త‌గిలింది. హైకోర్ట్ ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా స‌మాధానంRead More

జ‌గ‌న్ మ‌ర్డ‌ర్ ప్లాన్ ముందే జ‌రిగింది..!

Spread the loveవైఎస్ జ‌గ‌న్ పై జ‌రిగిన మ‌ర్డ‌ర్ అటెంప్ట్ ప‌క్కా స్కెచ్ అని ఇప్ప‌టికే క్లారిటీ వ‌చ్చేసింది. అయితేRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *