Main Menu

గంద‌ర‌గోళంలో జ‌న‌సేన‌..!

janasena
Spread the love

ఏపీ రాజ‌కీయాలు హీటుమీదున్నాయి. రెండు ప్ర‌ధాన పార్టీలు నువ్వా నేనా అన్న‌ట్టుగా సాగుతున్నాయి. నంద్యాల న‌డిబొడ్డులో స‌త్తా చాటాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నాయి. కాంగ్రెస్ లాంటి కొన్ని పార్టీలు అభ్య‌ర్థుల‌ను బ‌రిలో దింపినా అస‌లు వారి ఊసే వినిపించ‌డం లేదు. ఇలాంటి స‌మ‌యంలో తామే ప్ర‌త్యామ్నాయం అని చెప్పుకుంటున్న జ‌న‌సేన జాడే కాన‌రావ‌డం లేదు. ఈ ఎన్నిక‌ల్లో త‌న నిర్ణ‌యం మీద రెండు రోజుల్లో ప్ర‌క‌ట‌న చేస్తాన‌ని ఆపార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు. ఆమాట చెప్పి ప‌క్షం రోజుల‌వుతోంది గానీ ఆయ‌న నుంచి ఉలుకూ ప‌లుకూ లేదు. మ‌రో ప‌ది రోజుల్లో ఎన్నిక జ‌ర‌గ‌బోతోంది. దాంతో అస‌లు నంద్యాల‌లో త‌మ ప‌రిస్థితి ఏమిటో తెలియ‌క జ‌న‌సేన గంద‌ర‌గోళంలో ప‌డింది. సోష‌ల్ మీడియా వేదిక‌గా సాగుతున్న హోరాహోరీ క్యాంపెయిన్స్ లో తాము ఎవ‌రిని స‌మ‌ర్థించాలో తెలియ‌క చాలామంది పీకే ఫ్యాన్స్ త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు జ‌న‌సేనలో జోష్ క‌నిపించేది. రెండు పార్టీల‌ను త‌ప్పుబ‌డుతూ జ‌న‌సైనికుల పోస్టుల ప‌రంప‌ర సాగేది. ప్ర‌త్యేక హోదా లాంటి అంశాల వారీగా అటు జ‌గ‌న్, ఇటు చంద్ర‌బాబు రాజీప‌డ్డారంటూ విమ‌ర్శ‌లు గుప్పించేవారు. అలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ మ‌ళ్లీ చంద్ర‌బాబుని క‌ల‌వ‌డం, ర‌హ‌స్య‌మంత‌నాలు జ‌ర‌పడంతో చాలామందిలో సందిగ్ధ‌త ఏర్ప‌డింది. ఏపీ సీఎం విధానాల వైప‌ల్యం ప్ర‌జ‌ల్లో అసంతృప్తిని రాజేసింది. తీవ్ర‌వ్య‌తిరేక‌త‌గా మారుతోంది. దానికి త‌గ్గ‌ట్టుగా స్పందించాలంటే అస‌లు త‌మ పార్టీ టీడీపీతో వెళుతుందా లేదా అన్న‌ది స్ప‌ష్టం కావాలి.

దానికి ఈ ఎన్నిక‌ల్లోనే స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని అంతా భావిస్తున్నారు. నంద్యాల‌లో క‌లిసి వెళ్లే వారే వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేస్తార‌న్న విష‌యంలో క్లారిటీకి రావ‌చ్చు. అందుకే అంతా నంద్యాల ఎన్నిక‌ల మీద దృష్టిపెట్టారు. అలాంటి స‌మ‌యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాత్రం తాను చెప్పిన మాట‌ను మ‌ర‌చిపోయారా అన్న ప్ర‌శ్న ఆపార్టీ అభిమానుల్లో క‌నిపిస్తోంది. చంద్ర‌బాబుని స‌మ‌ర్థిస్తున్నారా లేదా అన్న విష‌యం వెల్ల‌డిస్తే దానిని బ‌ట్టి తాము స్పందించే అవ‌కాశం ఉంటుంద‌ని కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. పీకే సైలెన్స్ తో త‌మ‌కు ఎటూ పాలుపోవ‌డం లేదని వాపోతున్నారు. నంద్యాల‌లో కూడా ప‌వ‌న్ అభిమానులు ఎవ‌రికి మ‌ద్ధ‌తివ్వాల‌న్న విష‌యంలోనూ స్ప‌ష్ట‌త లేక‌పోవ‌డం మ‌రింత గంద‌ర‌గోళంగా త‌యార‌వుతోంది.

వాస్త‌వానికి జ‌న‌సేన త‌రుపున ఈ ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఖాయ‌మ‌ని ఆశించారు. టీడీపీ పెద్ద‌లు మ‌రో అడుగు ముందుకేసి ప‌వ‌న్ ని ప్ర‌చారానికి కూడా ఆహ్వానించారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ రెండు నెర‌వేర‌లేదు. ప్ర‌చారానికి అవ‌కాశం లేద‌ని చెప్పేసిన‌ప్ప‌టికీ మ‌ద్ధ‌తు విష‌యంలో అండ‌గా నిలుస్తాన‌ని మాట ఇచ్చిన ప‌వ‌న్ జాప్యం చేస్తుండ‌డం టీడీపీ పెద్ద‌ల్లో క‌ల‌క‌లం రేపుతోంది. ఎన్నిక‌ల నాటిక‌యినా పవ‌న్ మ‌ద్ధ‌తు పొంద‌గ‌ల‌మ‌న్న అంచ‌నాలో వారున్నారు. అయితే జ‌న‌సేన శిబిరం మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. నంద్యాల‌లో ప‌రిస్థితిని గ‌మ‌నిస్తోంది. అన్నీ స‌రిచూసుకున్న త‌ర్వాతే నోరు విప్పాల‌ని భావిస్తోంది. లేకుంటే అన‌వ‌స‌రంగా పాల‌క‌పార్టీతో పాటు తాము కూడా అభాసుపాల‌య్యే ప్ర‌మాదం ఉంటుంద‌ని లెక్క‌లేస్తోంది. ఈలోగా జ‌న‌సేన అభిమానులు మాత్రం ఏమీ చెప్ప‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ గంద‌ర‌గోళానికి ముగింపు ఎప్పుడో ప‌వ‌న్ క‌ల్యాణే చెప్పాలి.


Related News

akhila priya

లోకేష్ ప్ర‌క‌ట‌న‌తో అఖిల‌ప్రియ‌కు అవ‌స్థ‌లు..

Spread the loveక‌ర్నూలు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ రాజేసిన మంట ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలాRead More

kiran-kumar-reddy

కిర‌ణ్ రాక‌తో వాపా, బ‌ల‌మా?

Spread the loveఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం మ‌ళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి క్రియాశీల‌కంగా మార‌బోతున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *