Main Menu

ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి గ‌ట్టి పోటీ!

Spread the love

రాజ‌కీయాలు స్థిరంగా ఉండ‌వు. అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోలేక‌పోతే అంధ‌కారం త‌ప్ప‌దు. అధికారం వైపు అడుగులు వేయాల్సిన వాళ్లు ఆఖ‌రికి అసెంబ్లీలో అడుగుపెట్ట‌గ‌ల‌రా లేదా అన్న‌ది సందేహం అవుతుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఉంది ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ప‌రిస్థితి. ఆరు నెల‌ల క్రితం అటు టీడీపీ, ఇటు వైసీపీని ఏకి పారేసిన ప‌వ‌న్ కి మంచి ఇమేజ్ ల‌భించింది. కానీ అంత‌లోనే ఆయ‌న స్వ‌రం స‌వ‌రించుకోవ‌డం, విప‌క్షం మీద దూకుడు, అధికార‌ప‌క్షం మీద ప్ర‌ద‌ర్శించ‌లేక‌పోవ‌డంతో అనుమానాలు బ‌ల‌ప‌డ్డాయి. ప‌వ‌న్ ప‌ట్ల సందేహాలు పెంచాయి. చివ‌ర‌కు ప‌రువు తీశాయి.

అన్నీ క‌లిసి ఇప్పుడు ఆయ‌న పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ స్థానాల్లో గ‌ట్టెక్కేనా లేదా అన్న గంద‌ర‌గోళం ఏర్ప‌రిచాయి. ముఖ్యంగా భీమ‌వ‌రం, గాజువాక‌లో ఆయ‌న గెలిస్తే ఏ సీటు వ‌దులుకుంటార‌న్న దానిపై జ‌న‌సేన శ్రేణులు సైతం స‌మాధానం చెప్ప‌లేని స్థితిలో ఉంది. దాంతో రెండు చోట్ల ఆయ‌న్ని ఓటర్లు విశ్వ‌సించ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతోంది.

అదే స‌మ‌యంలో గాజువాక‌లో టీడీపీ , వైసీపీ నుంచి స‌వాల్ ఎదుర్కొంటున్న ప‌వ‌న్, భీమ‌వ‌రంలో మాత్రం వైసీపీతో ముఖాముఖీగా పోరులో త‌ల‌ప‌డాల్సి వ‌స్తోంది. గాజువాక మ‌ధ్య‌త‌ర‌గ‌తి, కార్మిక‌వ‌ర్గం ఓట‌ర్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో కొంత ప్ర‌లోభాల‌కు త‌క్కువ ఛాన్స్ ఉంది. అంతేగాకుండా ఎంపీ అభ్య‌ర్థిగా ఉన్న ల‌క్ష్మీనారాయ‌ణ మూలంగా బుద్ధి జీవుల మ‌ద్ధ‌తు కొంత ఖాయంగా ఉంది. కానీ న‌ర్సాపురంలో నాగ‌బాబు వ‌ల్ల భీమ‌వ‌రంలో ప‌వ‌న్ కి క‌లిసొచ్చే అంశాలు క‌నిపించ‌డం లేదు. వైసీపీ నేత‌లు పెద్ద మొత్తంలో పంపిణీల‌కు సిద్ధ‌ప‌డిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది పైగా క్ష‌త్రియ సామాజిక‌వ‌ర్గం దూరం కావ‌డంతో జ‌న‌సేన‌కు మ‌రిన్ని క‌ష్టాలు త‌ప్ప‌డం లేదు.

ఈ నేప‌థ్యంలో సీఎం అవుతాన‌ని చెప్పిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెడ‌తాన‌ని మాత్రం చెప్ప‌డానికి సిద్ధ‌ప‌డాల్సిన ప‌రిస్థితికి ప‌డిపోయారు. అద‌యినా నెర‌వేరుతుందా లేదా అన్న ధీమా జ‌న‌సేన శ్రేణుల‌కు క‌నిపించ‌డం లేదు. గ‌ట్టిపోటీ ఎదుర్కొంటున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని ప్ర‌జ‌లు ఏమేర‌కు ఆశీర్వ‌దిస్తార‌న్న‌ది వేచి చూడాల్సిన అంశం






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *