Main Menu

కాల్చిన మాట‌ల వెనుక దురుద్దేశం లేద‌న్న జ‌గ‌న్

DGTnRsPUIAACrRo
Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో కాక రేపిన జ‌గ‌న్ వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం చ‌ల్లారిన‌ట్టుగానే క‌నిపిస్తోంది. ఈసీ జోక్యంతో వైఎస్ జ‌గ‌న్ కూడా వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. నంద్యాల స‌భ‌లో చేసిన కామెంట్స్ మీద 48 గంట‌ల్లోగా వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్ ని ఈసీ ఆదేశించింది. దాంతో ఆయ‌న స్పందించారు. త‌న మాటల వెనుక ఉద్దేశాన్ని లేఖ‌పూర్వ‌కంగా స‌మాధానం చెప్పారు.

నంద్యాల సభలో చంద్రబాబుపై తాను చేసిన వ్యాఖ్యల్లో దురుద్దేశాలు లేవ‌న్నారు. కేవలం ఎన్నికల హామీలను చంద్రబాబు అమలు చేయనుందునే ఆవేదనతో అలా మాట్లాడివచ్చిందని వివరణ ఇచ్చారు. హామీల అమలులో చంద్రబాబు వైఫల్యం చెందారని, ఈ కారణంగానే మనస్తాపం చెంది.. చంద్రబాబుపై అలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందన్నారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, నిరుద్యోగ భృతి, స్వాతంత్ర్య వేడుకల్లో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదన్నారు. ఎన్నిక‌ల ముందు మ్యానిఫెస్టోలో రాసిన అంశాల‌ను పూర్తిగా విస్మ‌రించార‌న్నారు. ప్ర‌జ‌ల‌ను మ‌రోసారి మాట‌ల‌తో వంచించాల‌ని చూస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఈ నేప‌థ్యంలో తాను అలాంటి కామెంట్స్ చేయాల్సి వ‌చ్చిందంటూ జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చారు.

దాంతో ప్ర‌స్తుతం వ్య‌వ‌హారం ఈసీ కోర్ట్ కి చేరింది. చంద్ర‌బాబు హామీల‌ను ప్ర‌స్తావిస్తూ జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇవ్వ‌డం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. త‌న వ్యాఖ్య‌ల్లో త‌ప్పు లేద‌న్న‌ట్టుగా జ‌గ‌న్ వివ‌ర‌ణ ఇచ్చిన తీరు ఆస‌క్తిదాయ‌క‌మే. ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.






Related News

akhila priya

లోకేష్ ప్ర‌క‌ట‌న‌తో అఖిల‌ప్రియ‌కు అవ‌స్థ‌లు..

Spread the loveక‌ర్నూలు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ రాజేసిన మంట ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలాRead More

kiran-kumar-reddy

కిర‌ణ్ రాక‌తో వాపా, బ‌ల‌మా?

Spread the loveఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం మ‌ళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి క్రియాశీల‌కంగా మార‌బోతున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *