Main Menu

జ‌గ‌న్ మ‌రోయాత్ర‌కు ముహూర్తం

Spread the love

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అధికారమే ల‌క్ష్యంగా అడుగులు వేస్తున్న వైసీపీ అధినేత వ్యూహాల‌కు ప‌దునుపెడుతున్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా మ‌రో యాత్ర‌కు స‌న్నాహాలు చేస్తున్నారు. త్వ‌ర‌లోనే బ‌స్సు యాత్ర ప్రారంభించాల‌ని నిర్ణ‌యించారు. వాస్త‌వానికి బ‌స్సు యాత్ర ఫిబ్ర‌వ‌రిలో నిర్వ‌హించాల‌ని భావించిన‌ప్ప‌టికీ వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాగానే యాత్ర ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

13 జిల్లాల్లోనూ బ‌స్సు యాత్ర సాగ‌బోతోంది. పాద‌యాత్ర సంద‌ర్భంగా క‌వ‌ర్ చేయ‌ని నియోజ‌క‌వ‌ర్గాల‌తో పాటు కీల‌క స్థానాల‌ను క‌వ‌ర్ చేసే రీతిలో ఈ యాత్ర ఉంటుంది. దానికి సంబంధించిన రూట్ మ్యాప్ స‌హా ఇతర స‌న్నాహాలు సిద్ధం చేసే ప‌నిలో వైసీపీ థింక్ ట్యాంక్ ఉంది. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల ఇంఛార్జులు, నాయకులతో సమావేశంలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

అంతేగాకుండా ఎన్నికల షెడ్యూల్‌ వెలువడిన ఒకటి, రెండు రోజుల్లోనే అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటిస్తామని చెప్పారు. అలాగే బస్సుయాత్ర కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు. పాదయాత్ర చేయని ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బస్సుయాత్ర ఉంటుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేసేవారిని గుర్తించాలని, సమర్ధత ఉన్నవారికే ఎన్నికల బాధ్యతలు అప్పగించాలన్నారు. నియోజకవర్గాల్లో కలిసి వచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుని పోవాలని సూచించారు.






Related News

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the loveమెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్Read More

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *