జగన్ పాదయాత్ర వాయిదా

jagan
Spread the love

అన్నవస్తున్నాడంటూ ఏపీ ప్రతిపక్ష నేత తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడింది. వారం రోజుల వాయిదా తర్వాత నవంబర్ మొదటి వారంలో జగన్ పాదయాత్ర ప్రారంభించాలని తాజాగా వైసీపీ నిర్ణయించింది. అంతకుముంందు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 27న పాదయాత్ర ప్రారంభించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల యాత్రను వారం పాటు వాయిదా వేయాలని నిర్ణయించారు. షెడ్యూల్ ప్రకారం ఇడుపలపాయ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. దానికన్నా ముందు తిరుమలలో స్వామి వారి దర్శనం చేసుకుని జగన్ బయలుదేరతారు.

ఇక పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగించబోతున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అక్కడే తన మహా ప్రస్థానం పాదయాత్ర ముగించడం విశేషం. ఇక ఈ యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్, ఫెడ్యూల్ కూడా ఖరారయినట్టు సమాచారం. తొలుత రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర సాగుతుంది. ముందుగా రాయలసీమ జిల్లాలైన కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలు.. ఆతర్వాత నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, చివరిగా చివరిగా శ్రీకాకుళం జిల్లా సరిహద్దు ఇచ్ఛాపురంతో ఈ కార్యక్రమం ముగుస్తుంది.

ఇక పార్టీ వ్యవహారాలు కూడా ఏపీ కేంద్రంగా నడపాలని వైసీపీ నిర్ణయించింది. దానికి సంబంధించి తాడేపల్లిలో ఎకరం స్థలం కొనుగోలు చేశారు. పార్టీ కార్యాలయం. పార్టీ అధినేత నివాసం కలిసి ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దానికి సమీపంలోనే ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి కూడా నివాస స్థలం కొనుగులు చేసి ఇంటి నిర్మాణం ప్రారంభించడం విశేషం. ఇక వైసీపీ కార్యాలయం వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.






Related News

ys jagan

వ్యూహాత్మక గందరగోళంలో వైసీపీ

Spread the loveవైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వరుసగా ఎదురవుతున్న సవాళ్లతో చిక్కుల్లో పడినట్టు కనిపిస్తోంది. పాదయాత్ర విషయంలో పదే పదే వాయిదాలుRead More

ys jagan

జగన్ కి ఊరటనిచ్చిన కోర్ట్

Spread the loveవైసీపీ అధినేత వైఎస్ జగన్ కి స్వల్ప ఊరట దక్కింది. అత్యంత ఆసక్తిరేపిన కోర్ట్ తీర్పు వెలువడడంతోRead More

  • జనసేన ప్లీనరీ
  • జనసేన నాయకుడు అరెస్ట్
  • ఆస్పత్రిలో చేరిన వెంకయ్య
  • వైసీపీని వీడని సందిగ్ధం
  • వైసీపీకి వరంలా మారిన రేవంత్ రెడ్డి
  • టీడీపీలోకి వచ్చేయండి..బుట్టా రేణుక పిలుపు
  • ఐలయ్యకు క్రేజ్ పెంచిన కోమటోళ్లు
  • లోకేష్ వినకపోయినా బాబు మాటకు కట్టుబడిన పవన్ !
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *