Main Menu

తండ్రి బాట‌లో రైతు పాట పాడిన జ‌గ‌న్

Spread the love

ఏపీ ప్ర‌తిప‌క్ష నాయకుడు వైఎస్ జ‌గ‌న్ సుదీర్ఘ పాత్ర ముగిసింది. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా విజ‌య‌సంక‌ల్పం పేరుతో భారీ బ‌హిరంగ‌స‌భ నిర్వ‌హించారు. ఈ బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న రైతుల మీద గురిపెట్టారు. ఒక‌ప్పుడు వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న పాద‌యాత్ర సంద‌ర్భంగా రైతు స‌మ‌స్య‌ల మీద గురిపెట్టి ప‌లితం సాధించిన నేప‌థ్యంలో అదే ఇచ్చాపురం నుంచి ఇప్పుడు జ‌గ‌న్ కూడా అదే పాట పాడుతుండ‌డం విశేషంగా మారింది.

రైతుల‌కు ఒక్కొక్క‌రికీ 12వేల రూపాయ‌ల చొప్పున పెట్టుబ‌డి వ్య‌యం అందిస్తామ‌ని జ‌గ‌న్ ఇచ్చిన హామీ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ్య‌వ‌సాయరంగాన్ని లాభ‌సాటిగా మార్చేందుకు ప్ర‌భుత్వ స‌హాయం అందుతుంద‌ని, దాని వ‌ల్ల అనేక పంట‌ల‌కు పెట్టుబ‌డి వ్య‌యంలో డ‌బ్భై, ఎనభై శాతం అందుతుంద‌ని జ‌గ‌న్ పేర్కొన్నారు. అంతేగాకుండా రైతు పంట‌ల‌కు ఇన్సూరెన్స్ కూడా ప్ర‌భుత్వ‌మే బాధ్య‌త తీసుకుంటుంద‌ని జ‌గ‌న్ హామీ ఇచ్చారు.

వాటితో పాటు ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ కోసం 3వేల కోట్ల రూపాయ‌లు కేటాయిస్తాన‌ని హామీ ఇచ్చారు. రైతు పండించిన పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని జ‌గ‌న్ తెలిపారు. ద‌ళారీలు కూడా త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో రైతుల పంట‌ల‌కు మంచి ధ‌ర చెల్లించాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంద‌న్నారు. ప్ర‌తీ మండ‌లంలోనూ కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేస్తామ‌ని , ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేసి అన్న‌దాత‌ల‌కు తోడుగా ఉంటామ‌న్నారు. ఆక్వా రైతుల‌ను కూడా ఆదుకుంటామ‌న్నారు. పాల‌రైతుల స‌మ‌స్య‌ల‌ను కూడా ప్ర‌స్తావించారు. హెరిటేజ్ లాభాల కోసం పాల‌రైతుల‌నుక‌ష్టాల్లోకి నెడుతున్నార‌ని విమ‌ర్శించారు.

పాల‌రైతులంద‌రికీ లీట‌ర్ కి నాలుగు రూపాయ‌లు బోన‌స్ గా చెల్లిస్తామ‌న్నారు. క‌రువు వ‌చ్చినా, తుఫాన్ వ‌చ్చినా ఆదుకునేందుకు స‌మ‌గ్ర చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. నాలుగు వేల కోట్ల‌తో ప్రకృతి వైప‌రీత్యాల స‌హాయ నిధి ఏర్పాటుచేస్తామ‌న్నారు. అందులో స‌గం కేంద్రం భ‌రిస్తుంద‌న్నారు. రైతు ప్ర‌మాద‌శాత్తూ మ‌ర‌ణించినా, ఆత్మ‌హ‌త్య చేసుకున్నా 5ల‌క్ష‌ల రూపాయ‌ల‌తో ఆయా కుటుంబాల‌నుఆ దుకుంటామ‌న్నారు. అసెంబ్లీలో చ‌ట్టం చేసి ఆ కుటుంబానికి స‌హయ నిధి ఉపయోగ‌ప‌డేలా చేస్తామ‌న్నారు.

రైతుల‌కు జ‌గ‌న్ వ‌రాల జ‌ల్లు కురిపించిన తీరు త‌న తండ్రి బాట‌లోనే ఉన్న‌ట్టు భావిస్తున్నారు. తండ్రి స్ఫూర్తితోనే జ‌గ‌న్ ఇలాంటి హామీలు ఇచ్చిన‌ట్టుగా అంచ‌నాలు వేస్తున్నారు. రాజ‌కీయంగా చంద్ర‌బాబు పాల‌న‌లో క‌రువు స‌హా ప‌లు స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న రైతుల‌కు జ‌గ‌న్ హామీలు ఊర‌ట‌నిచ్చే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు,.






Related News

మ‌ళ్లీ టీడీపీ, జ‌న‌సేన క‌ల‌యిక‌కి కార‌ణాలివే

Spread the loveచాలాకాలంగా ఏపీ రాజ‌కీయాల్లో తెలుగుదేశం తీరు మీద ఓ కామెంట్ ఉంది. చంద్ర‌బాబు ఒంట‌రిగా ఎన్నిక‌ల‌ను ఎదుర్కోలేర‌న్న‌దిRead More

ష‌ర్మిళ కేసులో టీడీపీ ఎంపీకి చిక్కులు త‌ప్ప‌వా?

Spread the loveష‌ర్మిళ వ్య‌వ‌హారం ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ ష‌ర్మిళ మీద టీడీపీ ఎంపీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *