Main Menu

జ‌గ‌న్ కేసులో చంద్ర‌బాబు స‌ర్కారుకి ఝ‌ల‌క్

Spread the love

ఏపీ ప్ర‌భుత్వానికి ఝ‌ల‌క్ తగిలింది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన వ్య‌వ‌హారం చివ‌ర‌కు ప్ర‌భుత్వ మెడ‌కు చుట్టుకునేలా క‌నిపిస్తోంది. ఈ కేసు విష‌యంలో కేంద్రానికి బ‌ద‌లాయించేందుకు హైకోర్ట్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. ఎన్ ఐ ఏ కి ద‌ర్యాప్తు జ‌ర‌ప‌డానికి త‌గ్గ‌ట్టుగా చ‌ర్య‌లు క‌నిపిస్తున్నాయి.

కోర్ట్ లో తాజా విచార‌ణ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వ ఏజీ వాద‌న‌ను కోర్ట్ అసంతృప్తి వ్య‌క్తం చేసింది. సెక్ష‌న్ 3(ఏ) ఎందుకు న‌మోదు చేయ‌లేద‌ని నిల‌దీసింది. ఇద్ద‌రు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగిన ఘ‌ర్ష‌ణ గా చెప్పేందుకు చేసిన ప్ర‌య‌త్నాన్ని హైకోర్ట్ ఏకీభ‌వించ‌లేదు. 14వ తేదీకి విచార‌ణ వాయిదా వేశారు. ఈలోగా కేంద్ర‌మే నిర్ణ‌యం తీసుకుని కేసును ఎన్ ఐ ఏ కి ఇస్తారా లేదా అన్న‌ది తేల్చేల‌ని ఆదేశించింది. ఈ కేసులో నివేదిక‌ను కేంద్రానికి అందించామ‌ని సీఐఎస్ఎఫ్ త‌రుపున కోర్ట్ కి తెలిపారు. దాని ఆధారంగా ద‌ర్యాప్తు జ‌రిగి ఉంటే సీల్డ్ క‌వ‌ర్ లో కోర్ట్ కి అందించాల‌ని కూడా హైకోర్ట్ ఆదేశాలు ఇచ్చింది.

దాంతో జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి విష‌యంలో ఏపీ డీజీపీ, ప్ర‌భుత్వ పెద్ద‌లు చేసిన వాద‌న‌లు ఇప్పుడు పెను సంక‌టంగా మారే స్థితి క‌నిపిస్తోంది. ఒక సారి ఎన్ ఐ ఏ ప‌రిధిలోకి వెళితే రాష్ట్ర పోలీసుల వ్య‌వ‌హార‌శైలి కూడా విచార‌ణ ప‌రిధిలోకి వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. అదే జ‌రిగితే చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి చిక్కులు త‌ప్ప‌వ‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఎయిర్ పోర్ట్ లో జ‌రిగిన దాడిపై నిష్ప‌క్ష‌పాత ద‌ర్యాప్తు జ‌ర‌పాల‌ని ఇప్ప‌టికే జ‌గ‌న్ కోరుతున్నారు. జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌లు జోక్యం చేసుకోవాల‌ని ఎమ్మెల్యే ఆర్కే వంటి వారు కోర్ట్ ని ఆశ్ర‌యించారు. దాంతో వాట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని జ‌గ‌న్ ఆశిస్తున్న‌ట్టుగా ద‌ర్యాప్తు కేంద్ర ఇన్వెస్టిగేటివ్ ఏజ‌న్సీకి చేరితే అది చంద్ర‌బాబుకి ఎదురుదెబ్బ అవుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా నిందితుడు శ్రీనివాస్ నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ సేక‌రించిన స‌మాచారం స‌హా అన్ని విష‌యాల్లోనూ ఎన్ ఐ ఏ జోక్యం చేసుకుంటే చివ‌ర‌కు సీసీ కెమెరాలు ప‌నిచేయ‌క‌పోవ‌డం స‌హా అన్ని వ్య‌వ‌హారాల వెనుక అస‌లు కార‌ణాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని ఆశిస్తున్నారు. అదే జ‌రిగితే అస‌లు కుట్ర‌దారుల పాత్ర బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఏమ‌యినా ఈ కేసు విష‌యంలో డిసెంబ‌ర్ 14న తుది నిర్ణ‌యం తీసుకోబోతున్న హైకోర్ట్ ఎలాంటి సంచ‌ల‌న తీర్పు ఇస్తుందో చూడాలి.


Related News

చంద్ర‌బాబు అభ్య‌ర్థుల క‌స‌ర‌త్తు ల‌క్ష్యం నెర‌వేరేనా?

Spread the loveఏపీలో తెలుగుదేశం పార్టీ గ‌తానికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌రి నిమిషం వ‌ర‌కూ ఊరించి, నామినేష‌న్ల గుడువు ముగిసిపోయేRead More

టీడీపీని వీడ‌బోతున్న మూడో ఎంపీ ఆయ‌నే..!

Spread the loveగోద‌వ‌రి జిల్లాల తెలుగుదేశం రాజ‌కీయాల్లో తోట బ్ర‌ద‌ర్స్ త‌ల‌నొప్పిగా త‌యార‌య్యారు. ఇప్ప‌టికే తోట త్రిమూర్తులు త‌న పార్టీRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *