Main Menu

మరో పిటీషన్ దాఖలు వేసిన జగన్

ys jagan
Spread the love

ఏపీ ప్రతిపక్ష నాయకుడు మరో అడుగు వేశారు. తన కార్యక్రమాల కోసం కార్యాచరణకు పూనుకున్నారు. అందులో భాగంగా సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టబోతున్న పాదయాత్ర నేపథ్యంలో ఈ పిటీషన్ ఆసక్తిగా మారింది. తాజాగా ఆయన నాంపల్లి సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నవంబర్ 2 నుంచి పాదయాత్ర చేపడుతున్నందున ప్రతీ శుక్రవారం హాజరయ్యే విచారణకు మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఆరు నెలలపాటు కోర్టుకు రాకుండా ఉండేందుకు అనుమతించాలని జగన్ పిటిషన్ లో విజ్ఞప్తి చేశారు. కాగా సీబీఐ కోర్టు దీనిపై తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది.

దాంతో ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. వాయిదా నిమిత్తం కోర్ట్ కి హాజరుకావాల్సి వస్తే అప్పుడు పాదయాత్ర పరిస్థితి ఏమిటనే చర్చ మొదలయ్యింది. దాంతో ముందుగానే కోర్ట్ అనుమతి కోరాలని జగన్ నిర్ణయించడంతో కోర్ట్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి రేకెత్తిస్తోంది.






Related News

pawan cbn

టీడీపీపై ప‌వ‌న్ సెటైర్లు

Spread the loveఏపీలో అధికార పార్టీపై జ‌న‌సేన అధినేత మ‌రోసారి సెటైర్లు వేశారు. తాజాగా అవిశ్వాస‌తీర్మానాన్ని ఎలా న‌మ్మాలంటూ నిల‌దీశారు.Read More

akhila priya

లోకేష్ ప్ర‌క‌ట‌న‌తో అఖిల‌ప్రియ‌కు అవ‌స్థ‌లు..

Spread the loveక‌ర్నూలు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ రాజేసిన మంట ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *