Main Menu

అత‌డిని నేనెప్పుడూ చూడ‌నేలేదంటున్నజ‌గ‌న్

Spread the love

వైఎస్ జ‌గ‌న్ ఆస‌క్తికర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై త‌న అంచ‌నాలు వెల్ల‌డించారు. ముఖ్యంగా చంద్ర‌బాబుకి, త‌నకు మ‌ధ్యే పోటీ ఉంద‌ని అంగీక‌రించారు. అదే స‌మ‌యంలో ప‌వ‌న్ తీరు మీద జ‌గ‌న్ చేసిన కామెంట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఏపీలో ప్ర‌స్తుతం అత్యంత తీవ్ర‌మైన ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌న్నారు. 1994, 2004 ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే అధికార ప‌క్షాలు మ‌ట్టిరకొట్టుకుపోయాయ‌ని వివ‌రించారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌లిసి పోటీ చేస్తే తాను సంతోషిస్తాన‌న్నారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్ల చీలిక త‌గ్గి తాము సునాయాసంగా విజ‌యం సాధిస్తామ‌న్నారు. పొత్తుల‌కు అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ దేవుడు, ప్ర‌జ‌ల మీద విశ్వాసంతోనే తాను సాగుతున్న‌ట్టు వెల్ల‌డించారు

ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లుస్తున్నార‌న్న ప్ర‌చారంపై తాను ఇంత‌వ‌ర‌కూ ప‌వ‌న్ ని చూడ‌నేలేద‌ని, అలాంటి వ్య‌క్తి మీద మాట్లాడ‌డం త‌గ‌ద‌న్నారు. తెలంగాణాలో చంద్రబాబుకి జ‌న‌సేన మ‌ద్ధ‌తు ఇచ్చిన‌ట్టు ప్ర‌క‌టించార‌ని, తాను, ప‌వ‌న్ క‌లిస్తే జ‌గ‌న్ కి వ‌చ్చిన ఇబ్బందేమిట‌ని చంద్ర‌బాబు మాట్లాడార‌ని కాబ‌ట్టి వాళ్లిద్ద‌రూ క‌లిసి వ‌స్తే మంచిద‌న్నారు. గ‌తంలో ప‌వ‌న్ అనుకూల ఓట్ల‌న్నీ చంద్ర‌బాబుకి ప‌డ్డాయి కాబ‌ట్టి, ఇప్పుడు వారిద్ద‌రూ విడిపోతే టీడీపీకే న‌ష్ట‌మ‌ని అంచ‌నాలు వేశారు.

జ‌గ‌న్ మొండివాడ‌ని త‌న విమ‌ర్శ‌కుల వాద‌న మాత్ర‌మేన‌ని కొట్టి పారేశారు. తాను అంద‌రితో చ‌ర్చించి నిర్ణ‌యాలు తీసుకుంటాన‌ని, గ‌తంలో బీజేపీతో త‌మ‌కు పొత్తుల విష‌యం ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు అంద‌రు సీనియ‌ర్ల‌తో క‌లిసి చ‌ర్చించిన మేర‌కే తాము పొత్తు కాద‌న్నామ‌న్నారు.చంద్ర‌బాబు అనుకూల మీడియా సృష్టి మాత్ర‌మేన‌న్నారు. ఇటీవ‌ల సోష‌ల్ మీడియా రావ‌డంతో త‌మ పార్టీ శ్రేణులు బ‌లంగా దుష్ప్ర‌చారాన్ని తిప్పికొడుతున్నాన‌న్నారు. చంద్ర‌బాబు అవినీతిపై స‌మ‌గ్ర విచార‌ణ త‌ప్ప‌ద‌న్నారు. కోర్టు మెట్లెక్కిస్తామ‌న్నారు.

ఫిబ్ర‌వ‌రిలో గృహ‌ప్ర‌వేశం

చంద్రబాబు సొంత ఇల్లు హైద‌రాబాద్ లో క‌ట్టుకున్నార‌ని జ‌గన్ ఎద్దేవా చేశారు. రాజ‌ధాని లో శాశ్వ‌త నిర్మాణాలు లేవ‌ని, అవినీతి హ‌ద్దులు మీరింద‌ని, కేంద్ర ప్ర‌భుత్వం ప‌రిధిలోకి వెళ్లే స్థాయిలో ఉంద‌న్నారు. తాను మాత్రం సొంత ఇల్లు, ఆఫీసు క‌ట్టుకున్నాని, ఫిబ్ర‌వ‌రిలో గృహ‌ప్ర‌వేశం చేస్తున్న‌ట్టు తెలిపారు.


Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *