పవన్ కల్యాణ్ అవార్డ్ వెనుక అసలు కథ ఇదేనా?

PAWAAN IEBF
Spread the love

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి తాజాగా అంతర్జాతీయ గుర్తింపు లభించినట్టు ఆ పార్టీ ప్రకటన చేసింది. ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ చేసిన క్రుషికి ఇది గుర్తింపుగా పేర్కొన్నారు. ఉద్దానం నుంచి చేేనేత వరకూ వివిధ సమస్యలపై స్పందించిన తీరు, సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలతో ఆయనకు అవార్డ్ అందించబోతున్నట్టు ప్రకటన సారాంశం. సినిమా హీరోగా లక్షల మంది అభిమానులుండడం కూడా అవార్డుల అర్హతగా పేర్కొన్నారు. త్వరలో ఆయనకు లండన్ లో ఈ అవార్డ్ ప్రదానం జరగబోతోంది.

అయితే పీకే అవార్డ్ ప్రకటన వెంటనే సోషల్ మీడియాలో విస్త్రుత చర్చ మొదలయ్యింది. జనసేన అధినేతకు అవార్డ్ పై వివిధ రకాల వాదనలు వినిపిస్తున్నాయి. జనసైన్యమంతా ఇది పవన్ శ్రమకు గుర్తింపుగా పేర్కొంటోంది. కానీ వాస్తవాలు వేరుగా ఉన్నాయని మరో వర్గం వాదన. ముఖ్యంగా అవార్డ్ ప్రకటించిన ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరం IEBF సంస్థ తీరు మీద పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ సంస్థను 2000లో ప్రారంభించారు. కానీ అవార్డులు మాత్రం 2014 తర్వాతనే ప్రకటిస్తున్నారు. అంతేగాకుండా ఈ సంస్థ వ్యవస్థాపకుడిగా ఉన్న విజయ్ గోయల్ ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కావడం విశేషం. లండన్ లో ఏపీకి పెట్టుబడులు ఆకర్షించడం కోసం అంటూ విజయ్ గోయల్ ను చంద్రబాబు ప్రతినిధిగా గతంలోనే నియమించారు.

చంద్రబాబు ఏపీ సీఎం అయిన తర్వాత ఆయనకు పదవితో పాటు లండన్ లో ఓ కార్యాలయం కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాతే ఈ అవార్డుల వ్యవహారం తెరమీదకు వచ్చింది. అంతేగాకుండా ఆ సంస్థ అవార్డుల కమిటీకి సలహాదారులుగా ఉన్న వారికి కూడా అవార్డులు ఇచ్చిన అనుభవం ఉంది. దాంతో ఈ అవార్డ్ హాస్యాస్పదంగా ఉందనే వాదన వినిపిస్తోంది. దాంతో పాటుగా ఈ అవార్డ్ వెనుక చంద్రబాుబ స్కెచ్ ఉందని కొందరు అనుమానిస్తున్నారు. పవన్ కల్యాణ్ ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఇలాంటి కథ తెరమీదకు తెచ్చారని, అందుకు తగ్గట్టుగా ఏపీ ప్రభుత్వ ప్రతినిధి సాయంతో అవార్డ్ ప్రకటించడం, పవన్ కి లండన్ లో ప్రత్యేక గుర్తింపు అని ప్రచారం చేయడం జరుగుతోందని సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి.

ఏమయినా ఏపీలో ఈ అవార్డుల రాజకీయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఈ గుర్తింపును చూసి తబ్బిఉబ్బవుతుండగా, వ్యతిరేకులు మాత్రం ఇదంతా పొలిటికల్ డ్రామాగా కొట్టిపారేస్తున్నారు. మొత్తంగా జనసేనకు ఇండో యూరోపియన్ సంస్థ నుంచి వచ్చిన గుర్తింపు వ్యవహారం చర్చనీయాంశమే.


Related News

Chandrababu-naidu-serious-on-media-houses

ముందస్తు ఎన్నికలు ఖాయం అంటున్న ముఖ్యమంత్రి

Spread the loveదేశంలో ముందస్తు ఎన్నికల సంకేతాలు వచ్చేశాయి. చంద్రబాబు స్వయంగా ఈ విషయం ప్రకటించారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంRead More

pawan-mahesh kathi-colalge

కత్తి మహేష్ మనసు మార్చుకోవడం వెనుక..

Spread the loveకత్తి మహేష్ మనసు మార్చుకున్నారు. హఠాత్తుగా ఫిర్యాదుని సైతం ఉపసంహరించుకున్నారు. నిర్ణయం మార్చుకుని సామరస్యపూర్వకంగా స్వీట్లుపంచుకున్నారు. సెల్పీలుRead More

 • బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…
 • పరువు కాపాడుకోవడానికి బాబు…
 • పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు
 • ఆ లేఖ ఫేక్
 • జనసేనానికి తలైవా పాఠం?
 • పోలవరంలో కొత్త తగాదా
 • రాజమౌళికి షాకిచ్చిన రాజధాని
 • రంగంలోకి జేసీ సన్స్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *