Main Menu

టీడీపీలో కుదుపులు

Spread the love

క‌డ‌ప‌లో టీడీపీది క‌ల‌హాల కాపురంలా మారుతోంది. అస‌లే పార్టీ ప‌రిస్థితి అంతంత‌మాత్రంగా ఉన్న జిల్లా అది. గ‌డిచిన‌ ఎన్నిక‌ల్లో కేవ‌లం ఒకే ఒక్క సీటు ద‌క్కింది. అలాంటి చోట వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌ట్టు సాధించాల‌ని టీడీపీ ఆశిస్తోంది. అయితే అధిష్టానం ఆశ‌ల‌కు, క్షేత్ర‌స్థాయిలో ప‌రిస్థితుల‌కు పొంత‌న క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా టీడీపీ నేత‌ల మ‌ధ్య విబేధాలు అధికార పార్టీ ని అభాసుపాలుజేస్తున్నాయి.

ఇప్ప‌టికే ప్రొద్దుటూరు త‌గాదా కొన‌సాగుతోంది. ఎంపీ సీఎం ర‌మేష్ వ్య‌వ‌హార‌శైలి మీద మాజీ ఎమ్మెల్యే వ‌ర‌ద‌రాజుల రెడ్డి వ‌ర్గం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఏకంగా స‌ర్పంచ్ కి ఎక్కువ‌, ఎంపీపీకి త‌క్కువా అంటూ ఎంపీ మీద వ‌ర‌ద‌రాజుల రెడ్డి చేసిన కామెంట్స్ వైర‌ల్ అయ్యాయి. దాంతో అధిష్టానం రంగంలో దిగి మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి నేతృత్వంలో ఐదుగురు స‌భ్యుల‌తో క‌మిటీ వేశారు. కానీ ప‌రిస్థితుల్లో మార్పు మాత్రం క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల చిన్న వివాదం మ‌ళ్లీ చిచ్చు రాజేసింది. అన్న‌క్యాంటీన్ విష‌యంలో మునిసిప‌ల్ చైర్మన్‌ ఆసం రఘురామిరెడ్డి, టీడీపీ నేత ముక్తియార్‌ల మధ్య విభేదాలు చోటు చేసుకొని ఇద్దరు నేతలు పత్రికలకెక్కారు. దాంతో టీడీపీకి త‌ల‌నొప్పులు పెర‌గ‌డ‌మే త‌ప్ప త‌గ్గుతున్న దాఖ‌లాలు క‌నిపించడం లేదు.

ఇప్పుడు మ‌ళ్లీ రాజంపేట‌ నియోజకవర్గంలోకూడా విబేధాలు రాజుకున్నాయి. ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జునరెడ్డి, టీడీపీ నాయకురాలు పత్తిపాటి కుసుమకుమారిల మధ్య వ‌ర్గ‌పోరు శృతిమించుతోంది. ఎమ్మెల్యే మీద కుసుమకుమారి చేసిన బహిరంగ విమర్శలు క‌ల‌కలం రేపుతున్నాయి. రాజంపేట నియోజకవర్గానికి చెందిన‌ పత్తిపాటి కుసుమకుమారి రెండుసార్లు టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలిగా పనిచేసింది. రెండేళ్ల క్రితం ఎమ్మెల్యే మేడా పావులు కదిపి కుసుమకుమారిని ఆ పదవి నుంచి తప్పించి జిల్లా మహిళా అధ్యక్షురాలిగా మల్లెల శ్రీవాణిని ఎంపిక చేయడంలో కీలకంగా వ్యవహరించారు. ఆనాటి నుంచి మేడా, కుసుమకుమారిల మధ్య అంతర్గతపోరు సాగుతూ వస్తోంది. ఎమ్మెల్యేపై నియోజకవర్గానికి చెందిన ప‌లువురు నేత‌లు ఇన్‌చార్జి మంత్రి సోమిరెడ్డి, మంత్రి ఆదినారాయణరెడ్డిలకు ఫిర్యాదు చేశారు. ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యతనిస్తూ మిగిలిన వారిని విస్మరిస్తున్నారని, ఈసారి టిక్కెట్‌ ఇస్తే మేడా గెలవడని మంత్రుల ఎదుటే ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కుసుమకుమారి కూడా పాల్గొని ఆ నేతలకు మద్దతుగా వ్యవహరించారు.

దాంతో ఓవైపు ప‌సుపులేటి బ్ర‌హ్మ‌య్య తో త‌గాదా సాగుతుండ‌గానే మ‌రోవైపు కుసుమ‌కుమారి, మేడా మ‌ధ్య క‌ల‌హం టీడీపీ ఆశ‌ల మీద నీళ్లు జ‌ల్లే ప‌రిస్థితిని తీసుకొస్తుంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మవుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కిన ఏకైక నియోజ‌క‌వ‌ర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక జిల్లా అంత‌టా టీడీపీ త‌గాదాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చ‌ని ప‌లువురు చెబుతున్నారు.


Related News

వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌లో మ‌రో నెంబ‌ర్ తోడ‌య్యింది. వాస్తవానికి అధికారికంగా 67మందిని గెలిపించుకున్న ఈRead More

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the loveత్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *