బాబుకి హిజ్రాల పాలభిషేకం, పీకేకి థ్యాంక్స్

HIJRAS
Spread the love

మా దేవుడు నివేనయ్యా … మా భావవూ నివ్వెనయా …. అంటూ చంద్రబాబును హిజ్రాలు పాటలతో కొనియాడారు. అంతే కాదు చంద్రబాబు ఫొటోకు పాలాభిషేకం చేశారు . సమాజంలో వివక్షతకు గురవుతున్న హిజ్రాల సంక్షేమానికి చంద్రబాబు పింఛన్ పథకాన్ని తీసుకు వచ్చారు. వారికీ వేయి రూపాయల పింఛన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ప్రకటించడమే ఎందుకు కారణం … హిజ్రాలకు కూడా రూ. పింఛనులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు కలెక్టర్ల సమావేశంలో నిర్ణయించారు.

దీంతో చంద్రబాబు చిత్ర పటానికి ఆల్ ఇండియా సమతా హిజ్రాల హక్కుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో కర్నూల్ జిల్లా నంద్యాలలో పాలాభిషేకం నిర్వహించి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐక్య వేదిక అధ్యక్షుడు విజయ్ కుమార్ నేతృత్వం వహించారు. తమ దైన శైలిలో హిజ్రాలు నృత్యం చేస్తూ బాబు కు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి లో జరిగిన జిల్లా కలెక్టర్ ల సమావేశంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉన్న 3లక్షల మంది హిజ్రాలకు మేలు జరుగుతుందన్నారు విజయ్ కుమార్. నెలనెల రూ. 1000 పింఛన్లు, పక్కా ఇళ్ళు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు చంద్రబాబు ప్రకటించారని అన్నారు. మొదటి నుండి హిజ్రాలకు అండగా నిలిచిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు కూడా హిజ్రాల సంఘం తరపున ధన్యవాదాలు తెలిపారు.


Related News

19VJPAGE4BJP

క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?

Spread the loveప్ర‌త్యేక హోదా చుట్టూ సాగుతున్న రాజ‌కీయాలు చివ‌రి అంకానికి చేరుకుంటున్నాయి. ఎన్నిక‌ల త‌రుణం ముంచుకొస్తున్న నేప‌థ్యంలో రాజీనామాలుRead More

jagan-ysrcp-tdp

సంచలనంగా మారిన జగన్ ప్రకటన

Spread the loveఏపీలో ప్రత్యేక హోదా చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయి. పై చేయి కోసంRead More

 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..
 • బాబు సందేహం ఎందుకో…?
 • ఆమె కూడా పవన్ మీద గురిపెట్టిందా..?
 • బాబు సర్వేలో టీడీపీకి భారీ మెజార్టీ
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *