శ్రీచైతన్య, నారాయణకు నోటీసులు జారీ

Hyderabad_High_Court
Spread the love

విద్యార్థుల ఆత్మహత్యలపై నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ రెండు కళాశాలలతో పాటు ఏపీ, తెలం గాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విద్య, హౌం శాఖల ప్రధాన కార్యదర్శులు, ఇంటర్‌ బోర్డు కార్యదర్శులు, స్విమ్స్‌, నిమ్స్‌ డైరెక్టర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ప్క్రెవేటు విద్యా సంస్థల్లో, ఐఐటీల్లో విద్యార్థులు తీవ్ర ఒత్తిళ్ల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇందుకు కారణమైన కార్పొరేట్‌ కాలేజీలపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని కోరుతూ లోక్‌సత్తా ఉద్యమ సొసైటీ ప్రకాశం జిల్లా కన్వీనర్‌ దాసరి ఇమ్మాన్యుయేల్‌ రాసిన లేఖను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించి విచారణ చేపట్టింది.

ఆడుతూపాడుతూ చదువుకోవాల్సిన విద్యార్థులపై ర్యాంకుల కోసం తీవ్ర ఒత్తిడి పెంచుతున్నారని, దాని ఫలితంగానే పలు కార్పొరేట్‌ విద్యా సంస్థల్లో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడిందని ఈ సందర్భంగా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీనిలో తల్లిదండ్రుల పాపం కూడా ఉందని వ్యాఖ్యానించింది. 90 శాతం మార్కులు రావాలనే ఏకైక లక్ష్యంగా పిల్లలు ఏమతున్నారో కూడా చూడకుండా ఒత్తిడిని పట్టించుకోవడం లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేష్‌ రంగనాథన్‌, న్యాయమూర్తి ఎం.గంగారావులతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ఆందోళన వెలిబుచ్చింది.

సాక్షాత్తు ఏపీలో ఒక మంత్రికి చెందినదే కార్పొరేట్‌ కాలేజీ అని, కాలేజీలకు, హాస్టల్స్‌కు అనుమతులు లేకుండా నడుపుతున్నారని పిటిషనర్‌ వాదన. ఆత్మహత్యలకు పాల్పడిన కాలేజీలపై విచారణ జరిపి నివేదికలు ఇవ్వలేదని, ఆత్మహత్య ఘటనల తర్వాత కన్న తల్లిదండ్రుల్ని కూడా మతదేహాల దగ్గరకు వెళ్లనీయనంత కాఠిన్యంగా యజామాన్యాలు వ్యవహరిస్తున్నాయని, ఆయా కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ కేసు విచారణను మూడు వారాలకు హైకోర్టు వాయిదా వేసింది.


Related News

jayaprakash narayan

జేపీకి అది ద‌క్కుతుందా?

Spread the loveలోక్ స‌త్తా అధినేత చూపులు హ‌స్తిన వైపు మ‌ళ్లాయి. ఢిల్లీ రాజ‌కీయాల వైపు ఆయ‌న చూస్తున్నారు. కానీRead More

shivaji

హీరో శివాజీపై బీజేపీ దాడి

Spread the loveబీజేపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దిస్తున్న వారిపై బౌతిక దాడులు ప్రారంభించారు. తాజాగా సినిమాRead More

 • బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!
 • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
 • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *