Main Menu

ఓట‌ర్ల‌కు కుక్క‌ర్లు, సెల్ ఫోన్లు సిద్ధం!?

Spread the love

గోదావ‌రి జిల్లాల ప‌ట్ట‌భ‌ద్రుల స్థానానికి జ‌రుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నిక‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. ఈనెల 22న జ‌ర‌గ‌బోతున్న పోలింగ్ లో త‌మ భ‌విత‌వ్యం తేల్చుకునేందుకు భారీ సంఖ్య‌లో అభ్య‌ర్థులు త‌ల‌ప‌డుతున్నారు. స్క్రూట్నీ త‌ర్వాత 49 మంది అభ్య‌ర్థులు రంగంలో ఉన్నారు. అయితే పోటీ మాత్రం ఇద్ద‌రు ముగ్గురు మ‌ధ్య ప్ర‌ధానంగా సాగే అవ‌కాశం ఉంది.

మ‌రోసారి ఎమ్మెల్సీ సీటు ద‌క్కించుకోవాల‌ని ఆదిత్యా విద్యాసంస్థ‌ల చైర్మ‌న్ శేషారెడ్డి బ‌లంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే ప‌రిస్థితులు మార‌డంతో ఆయ‌న‌కు ప్ర‌యాస త‌ప్ప‌డం లేదు. పైగా ప్రైవేటు విద్యాసంస్థ‌ల త‌రుపున టీకే విశ్వేశ్వ‌ర రెడ్డి రంగంలో ఉండ‌డంతో శేషారెడ్డి ఆశ‌ల‌కు పెద్ద గండి ప‌డేలా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే మృధుస్వ‌భావిగా పేరున్న టీకే విశ్వేశ్వ‌ర్ రెడ్డికి ప్రైవేటు సంస్థ‌ల్లో మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్ర‌ధానంగా న‌న్న‌య యూనివ‌ర్సిటీ అఫిలియేటెడ్ సంస్థ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో చిత్తశుద్ధితో ప‌నిచేసిన నేత‌గా టీకేకి గుర్తింపు ఉంది. అంతేగాకుండా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో సుదీర్ఘ‌కాలంగా ప్ర‌జాజీవితంలో ఉన్న ఆయ‌న‌కు ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇది శేషారెడ్డికి నిరాశ క‌లిగించే అంశంగా భావిస్తున్నారు.

రాష్ట్ర జేఏసీ మాజీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ఇళ్ల వెంక‌టేశ్వ‌ర రావు(ఐవీ)కి విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. అన్ని త‌ర‌గ‌తుల్లోనూ ఐవీని గెలిపించి, నిజాయితీ చాటుకోవాల‌ని, సామాన్యుడికి ప‌ట్టంక‌ట్టాల‌నే సంక‌ల్పం క‌నిపిస్తుండ‌డం విశేషం. ప్రైవేటు విద్యాసంస్థ‌ల సిబ్బందిలో కూడా ఐవీ ప‌ట్ల సానుకూల‌త క‌నిపిస్తుంద‌నే స‌మాచారం చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది. త‌న విద్యాసంస్థ‌ల్లో ఫీజులుం సాగిస్తూ, విద్యార్థుల నుంచి లేటు ఫీజులు, ఇత‌ర ఫీజులంటూ భారీగా గుంజుకునే శేషారెడ్డి ఎన్నిక‌ల ముంగిట చిల‌క‌ప‌లుకులు ప‌లుకుతున్నారంటూ ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఇక నైతిక‌త గురించి మాట్లాడే అర్హ‌త లేక‌పోయినా ప‌రీక్ష పేప‌ర్ల లీకేజీ కేసులో జైలుకెళ్లి వ‌చ్చి ఇప్పుడు జ‌నాల ముందు నంగ‌నాచిలా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ టీకే విశ్వేశ్వ‌ర్ రెడ్డి వంటి వారు బ‌హిరంగంగానే విమ‌ర్శించారు.

మీడియా ముందు తాను ఎటువంటి తాయిలాలు పంచే అవ‌కాశం లేద‌ని తొలుత ప్ర‌క‌టించిన శేషారెడ్డి ఈ ప‌రిణామాలు మింగుడుప‌డ‌క మ‌ళ్లీ త‌న పాత అస్త్రాల‌ను సిద్ధం చేస్తున్నార‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది. గ‌తంలో ఆయ‌న ఎమ్మెల్సీగా పోటీ చేసిన కాలంలో ఉపాధ్యాయుల‌కు విందుల పేరుతో ర‌క‌ర‌కాల తాయిలాలు పంచిన చ‌రిత్ర ఉంది. కానీ ప్ర‌స్తుతం అలా చేసేది లేద‌ని శ‌ప‌థం చేసిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు ఆ దారిన న‌డిచి చివ‌రి ప్ర‌య‌త్నం చేయాల‌నే ఆలోచ‌న‌కు వ‌చ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే చైనా బ్రాండ్ కుక్క‌ర్లు, సెల్ ఫోన్లు లేదా ఇత‌ర చిన్న చిన్న గిఫ్టులు పంచేందుకు స‌న్నాహాలు చేశార‌నే ప్ర‌చారం జోరందుకుంది. వాటికి భిన్నంగా పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ముఖ్యంగా రాము సూర్యారావు వంటి నిజాయితీ ప‌రుడు, త్యాగ‌ధ‌నుడు కూడా ఐవీ కోసం ప్ర‌చారాన్ని ఉధృతం చేస్తున్నారు. ఐవీని గెలిపిస్తే మ‌ళ్లీ త‌న‌ను గెలిపించిన‌ట్టేన‌ని చెబుతున్నారు. ఇక విఠ‌పు బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం వంటి సీనియ‌ర్ ఎమ్మెల్సీలు సైతం ఎండ‌ల‌ను లెక్క చేయ‌కుండా జ‌నం ముందుకు వెళుతున్నారు. వివిధ సంఘాలు, వ్య‌క్తుల మ‌ద్ధ‌తుతో ఐవీ దూసుకుపోతున్నారు.

రాము సూర్యారావుని ఎమ్మెల్సీగా ఎన్నుకున్న స‌మ‌యంలో దేశ‌మంతా గోదావ‌రి జిల్లాల ఉపాధ్యాయుల‌ను కొనియాడింది. ప్ర‌లోభాల‌కు లొంగ‌కుండా నిజాయితీని గెలిపించినందుకు ఆంధ్ర‌జ్యోతి లాంటి ప‌త్రికలో ఎండీ రాధాకృష్ణ ఒక పేజ్ ఆర్టిక‌ల్ కూడా రాశారు. ఇక ఇప్పుడు అదే దారిలో ప‌ట్ట‌భ‌ద్రులు కూడా ఐవీని గెలిపిస్తే నిజాయితీకి మారుపేరుగా గోదావ‌రి జిల్లా వాసులు నిలుస్తార‌ని, నిజ‌మైన ప్ర‌జా సేవ‌కుల‌ను గెలిపించిన వార‌వుతార‌ని. అంద‌రి మ‌న్న‌న‌లు పొందే అవ‌కాశం ఉంద‌ని కూడా ప‌లువురు అంచ‌నాలు వేస్తున్నారు. దాంతో గోదావ‌రి జిల్లాల గ్రాడ్యుయేట్స్ తీర్పు చారిత్ర‌కంగా ఉంటుంద‌న‌డంలో సందేహం లేద‌నే అనేక మంది భావిస్తున్నారు.


Related News

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the loveమెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్Read More

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *