టీడీపీ నేతలకు థామస్ పరీక్ష

Chandrababu-naidu-NAra-Lokesh
Spread the love

తెలుగుదేశం నేతలకు అనూహ్య పరీక్ష ఎదురయ్యింది. ఇప్పటికే ఫీల్డ్ లో నంద్యాల, కాకినాడ పరీక్షల్లో గట్టెక్కిన నేతలకు కూడా ఈ పరీక్ష చుక్కలు చూపించింది. ప్రశ్నలకు జవాబులు రాయాల్సి రావడంతో ఖంగుతినాల్సి వచ్చింది.అయినా మానసిక స్థితి విశ్లేషణ అంటూ నాయకుడు నిర్ణయంతో నేతలు పరీక్షకు సిద్ధం కావాల్సి వచ్చింది. తమ ముఖ్య నేతలకు టీడీపీ అధినాయకత్వం వ్యక్తిత్వ విశ్లేషణ పరీక్ష నిర్వహించడం టీడీపీలో చర్చనీయాంశం అయ్యింది. సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ఇటువంటి పరీక్షల నిర్వహణలో ప్రఖ్యాతిగాంచిన థామస్‌ కంపెనీ రూపొందించిన ప్రశ్నపత్రాన్ని ప్రతి నేతకు ఒక ట్యాబ్‌లో ఇచ్చి వారితో వాటికి సమాధానాలు ఇప్పించారు. ఈ ప్రశ్నపత్రంలో 24 ప్రశ్నలు ఉన్నాయి. వీటికి సమాధానాలు ఇచ్చే వ్యక్తి వ్యక్తిత్వం.. వివిధ సందర్భాల్లో ఆ వ్యక్తి స్పందించే తీరు.. ఒత్తిడికి గురైనప్పుడు స్పందన ఎలా ఉంటుంది.. నాయకత్వ లక్షణాలు ఎలా ఉన్నాయి.. తదితర అంశాలను విశ్లేషించేలా ఈ ప్రశ్నలు రూపొందించారు. సమాధానాలిచ్చిన వారి మెయిల్‌కు కొన్ని గంటల్లో దీని ఆధారంగా ఒక విశ్లేషణ అందుతుంది. వారి బలాలు, బలహీనతలు, వ్యక్తిత్వ విశ్లేషణ తదితర అంశాలు ఇందులో ఉంటాయి.

దాంతో ఈ థామస్ టెస్ట్ తెలుగుదేశం నేతలను ఆశ్చర్యానికి గురిచేసింది. పరీక్ష సందర్భంగా నారా లోకేష్ హాల్ లో అటూ ఇటూ తిరుగుతూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. పరీక్ష ప్రాదాన్యతపై పలువురు నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.


Related News

ysrcp

వైసీపీ నేతపై రేప్ కేసు

Spread the love3Sharesవైసీపీ నేత ఒకరు చిక్కుల్లో పడ్డారు. ఏకంగా అత్యాచారం కేసులో ఇరుక్కున్నారు. పోలీసులు అయన్ని అరెస్ట్ చేయడంRead More

pspk

పవన్ ని కలిసిన లండన్ ఫ్యాన్స్

Spread the love సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రస్తుతం లండన్‌ పర్యటనలో ఉన్నారు. ప్రఖ్యాత ఇండో యూరోపియన్‌Read More

 • మరో ఫిరాయింపు ఎమ్మెల్యేకి పదవి
 • బాబు వల్ల కాదంటున్న జేసీ
 • జగన్ దూరం కావడంతో బాబు పెంచేశారు..
 • జగన్ ఛాలెంజ్ పై టీడీపీ అనూహ్య స్పందన
 • చంద్రబాబుకి 15రోజులు సమయమిచ్చిన జగన్
 • టీడీపీలో వాణీ బాణి సరిపోతుందా…?
 • బాబుకి మళ్లీ షాకిచ్చిన కేంద్రం!
 • జగన్ మళ్లీ వెనక్కి…
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *