Main Menu

సుజ‌నా చౌద‌రిపై ఈడీ దాడులు

Spread the love

కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌పై చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ఆంక్ష‌లు పెట్టిన‌ప్ప‌టికీ ఆయ‌న స‌న్నిహితుల‌పై ఈడీ దాడులు మాత్రం ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే ఎంపీ సీఎం ర‌మేష్ ఇంట్లో జ‌రిపిన ఐటీ సోదాల్లో ల‌భించిన ఆధారాలు ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తున్నాయి. కీల‌క ఆధారాలు దొర‌క‌డంతో దూకుడుగా ముందుకెళ్లే అవ‌కాశం ఉంద‌ని భావించారు. అయితే అనూహ్యంగా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో ఆచితూచి అడుగులేసేందుకు కేంద్రం ఆలోచిస్తుంద‌ని స‌మాచారం. తెలంగాణా ఎన్నిక‌ల త‌ర్వాత టీడీపీ నేత‌ల వ్య‌వ‌హారాల‌పై కేంద్రం క‌న్నేసే అవ‌కాశం ఉంద‌నే అనుమానాలు వినిపిస్తున్నాయి.

ఈలోగానే మాజీ కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రిపై ఈడీ కన్నేసింది. చెన్నై నుంచి వ‌చ్చిన ఈడీ బృందం సుజనా కార్యాల‌యంలో సోదాలు నిర్వ‌హించింది. హైద‌రాబాద్ లో ని సుజ‌నా చౌద‌రి కార్యాల‌యంలో నిర్వ‌హించిన దాడుల్లో ప‌లు ఆధారాలు ల‌భ్య‌మ‌మ‌యిన‌ట్టు భావిస్తున్నారు. అయితే సుజ‌నా చౌద‌రి ఇటీవ‌ల చంద్ర‌బాబుతో అంటీముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కీల‌కంగా భావిస్తున్న తెలంగాణా ఎన్నిక‌ల్లో జోక్యానికి నిరాక‌రించిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది. ఎన్నిక‌ల్లో కూడా ఆయ‌న భాగ‌స్వామిగా క‌నిపించ‌డం లేదు.

దాంతో ఈ వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. సుజ‌నా పై ఈడీ బృందం సోదాలు చివ‌ర‌కు ఎటు మ‌ళ్లుతాయోన‌నే చ‌ర్చ మొద‌ల‌వుతోంది.






Related News

వైసీపీ ఖాతాలో మ‌రో ఎమ్మెల్యే

Spread the loveఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య‌లో మ‌రో నెంబ‌ర్ తోడ‌య్యింది. వాస్తవానికి అధికారికంగా 67మందిని గెలిపించుకున్న ఈRead More

కేసీఆర్ సీఎం అయితే చంద్ర‌బాబుకి క‌ష్టాలే!

Spread the loveత్వ‌ర‌లోనే టీడీపీ కండువా క‌ప్పుకోబోతున్నట్టు ప్ర‌చారంలో ఉన్న మాజీ ఎంపీ స‌బ్బం హ‌రి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *