Main Menu

వైసీపీలో మ‌రో ముస‌లం

Spread the love

విప‌క్ష వైసీపీ ఊపు మీద ఉంద‌ని ఆ పార్టీ శ్రేణులు అంచ‌నాలు వేస్తున్నారు. వ‌రుస స‌ర్వేలు త‌మ‌కు అనుకూలంగా ఉండ‌డంతో అధికారం ఖాయ‌మ‌నే ఊహాగానాల‌తో సాగుతోంది. అయితే పార్టీలో విబేధాలు అస‌లుకే ఎస‌రు తెచ్చిపెట్టేలా క‌నిపిస్తున్నాయి. పాణ్యం వ్య‌వ‌హారం పూర్తిగా మ‌ర‌చిపోక‌ముందే ప్ర‌కాశం జిల్లాలో ప్ర‌కంప‌న‌లు క‌నిపిస్తున్నాయి. తాజాగా కీల‌క నేత వైవీ సుబ్బారెడ్డి త‌గాదా తెర‌మీద‌కు వ‌చ్చింది. ఒక‌వైపు జ‌గ‌న్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఊగిస‌లాట‌లో ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న త‌రుణంలో మ‌రో బాబాయ్ సుబ్బారెడ్డి మొఖం చాటేసిన తీరు విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది.

ఒంగోలు పార్ల‌మెంట్ సీటు ని వైవీ సుబ్బారెడ్డి మ‌ళ్లీ ఆశిస్తున్నారు. కానీ వాస్త‌వానికి రెండేళ్లుగా ఆ సీటుని వైవీ స్థానంలో మాగుంట కి కేటాయించాల‌నే ల‌క్ష్యంతో జ‌గ‌న్ ఉన్నారు. అందుకు త‌గ్గ‌ట్టుగా పావులు క‌దుపుతున్నారు. కానీ వైవీ మాత్రం త‌న‌కు ఒంగోలు ఎంపీ సీటు కాక‌పోతే ద‌ర్శి ఎమ్మెల్యే స్థాన‌మ‌యినా ద‌క్కుతుంద‌ని ఆశించారు. కానీ తీరా చూస్తే అలాంటి ఛాన్స్ లేక‌పోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న అల‌క‌బూనారు. జ‌గ‌న్ తీరుతో నిరాశ‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. చివ‌ర‌కు పార్టీ కార్యాల‌యం. జ‌గ‌న్ స్వ‌గ్ర‌హ ప్ర‌వేశాల‌కు బాబాయ్ దూరంగా ఉండ‌డం ఆస‌క్తిగా మారింది.

అదే స‌మ‌యంలో వైసీపీలోకి చాలాకాలంగా ఊరిస్తున్న మాగుంట రంగ‌ప్ర‌వేశం ఖాయం అయిన‌ట్టు ఈ ప‌రిణామాలు చాటుతున్నాయి. ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో ఇదో ఆస‌క్తిక‌ర అంశంగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో గోదావ‌రి జిల్లాల పార్టీ వ్య‌వ‌హారాల సమ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆ జిల్లాల నేత‌ల‌కు కూడా అందుబాటులో లేక‌పోవ‌డంతో వైసీపీ ప‌రిస్థితి కొంత అస్ప‌ష్టంగా మారుతోంది. ఈ విష‌యంలో జ‌గ‌న్ ఎలా స్పందిస్తార‌న్న‌దే ఇప్పుడు ఆస‌క్తిక‌రం.






Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the love499Sharesజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *