Main Menu

చంద్ర‌బాబుకి, కేసీఆర్ కి తేడా అదే!

kcr and cbn
Spread the love

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు అన్ని మార్లు రావు. వ‌చ్చిన అవ‌కాశాన్ని వినియోగించుకుంటేనే ఎవ‌రైనా ఎదుగుతారు. చిన్న అవ‌కాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటేనే ఛాంపియ‌న్ అవుతారు. కానీ ఏపీ సీఎం చంద్ర‌బాబు మాత్రం దానికి భిన్నం. ఆయ‌న అంద‌రిక‌న్నా సీనియ‌ర్ న‌ని చెప్పుకుంటారు. తానే మోడీ క‌న్నా ముందు వ‌చ్చాన‌ని చెప్పుకుంటారు. అవ‌న్నీ వాస్త‌వాలే. కానీ అంత సీనియ‌ర్ అయిన‌ప్ప‌టికీ కూడా చంద్ర‌బాబు కి కొన్ని స‌మ‌స్య‌లున్నాయి. ఆయ‌న నిర్ణ‌యాలు వేగంగా తీసుకోవ‌డంలోనూ, ముంద‌డుగు వేయడంలోనూ జాప్యం చేస్తారు. దాంతో ఆయ‌న అనేక మార్లు అవ‌కాశాలు కోల్పోతుంటారు. ఛాంపియ‌న్ నిల‌వాల్సిన స‌మ‌యంలో కూడా ఫాలోవ‌ర్ అయిపోతుంటారు. అందుకే ఆఖ‌రికి ఏడాది పాటు మోడీ అపాయింట్ మెంట్ ఇవ్వ‌కుండా నిరాశ‌ప‌రిచిన‌ప్ప‌టికీ ఆయ‌న ఏమీ మాట్లాడ‌లేని స్థితిలో ఉండిపోతారు.

అదే స‌మ‌యంలో కేసీఆర్ దానికి భిన్నం. చంద్ర‌బాబు త‌న‌ను చిన్న చూపు చూడ‌డంతో గ‌ట్టిగా బ‌దులివ్వాల‌నే ఉద్దేశంతోనే కేసీఆర్ తెలంగాణా నినాదం ఎత్తుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆ త‌ర్వాత ఎత్తులు పై ఎత్తుల‌తో ఆయ‌న ముంద‌డుగు వేశారు. అనేక ఆటంకాలు ఎదుర‌యినా ఎదుర్కొన్నారు. ఎప్పటిక‌ప్పుడు వేగంగా వ్యూహాలు మారుస్తూ ముందుకు సాగారు. తెలంగాణా ల‌క్ష్యాన్ని సాధించారు. రాజ‌కీయంగా స్థిర‌త్వం పొందారు. ఇప్పుడు ఏకంగా హ‌స్తిన మీద క‌న్నేశారు. చంద్ర‌బాబు సీఎం అయిన నాటికి క‌నీసం మంత్రిగా కూడా లేని కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజ‌కీయాల్లో తానే చ‌క్రం తిప్పుతాన‌ని మోడీకి స‌వాల్ విసురుతున్నారు. కేసులు పెడ‌తారా అంటూ ఎగ‌తాళిగా స‌వాల్ చేసి ఎదురొడ్డుతున్నారు. నిన్న‌టి వ‌ర‌కూ మోడీని పొగిడిన నాయ‌కుడే ఇప్పుడు తెగుడుతూ ముందుకు సాగుతాన‌ని చెబుతున్నారు.

అదే కేసీఆర్, చంద్ర‌బాబు మ‌ధ్య ఉన్న ప్ర‌ధాన వైరుధ్యం. చంద్ర‌బాబు త‌న బ‌ల‌హీన‌త‌ల మూలంగా అనుభ‌వాన్ని వినియోగించుకోలేని స్థితిలో ఉన్నారు. రెండుద‌శాబ్దాల క్రిత‌మే జాతీయ రాజ‌కీయాల్లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన నాయ‌కుడ‌యిన‌ప్ప‌టికీ ఇప్పుడు మాత్రం మోడీ ని చూసి వెన‌క‌డుగు వేస్తున్నారు. కానీ కేసీఆర్ అలా కాదు. ఆయ‌న త‌న జోలికి రాక‌ముందే మోడీని నిల‌బెట్ట‌డానికి ఆయ‌న సిద్ధ‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ , బీజేపీ ప‌క్షాల‌ను ఎదుర్కొంటానంటూ సాగుతున్నారు. మూడో ఫ్రంట్ కి నాయ‌క‌త్వం వ‌హిస్తానంటున్నారు. మోడీని ఎదుర్కోగ‌ల నాయ‌కుడెవ‌ర‌ని దేశ‌మంతా ఎదురుచూస్తున్న స‌మ‌యంలో తానే ఆ పాత్ర తీసుకుంటాన‌ని ముందుకొచ్చారు. మొత్తంగా దేశ రాజ‌కీయాల్లో చాలామంది నేత‌ల‌కు సాధ్యం కాని కార్య‌క్ర‌మాన్ని భుజాన‌కెత్తుకుని న‌డుస్తున్నారు. మొత్తంగా ఇప్పుడు అంద‌రి దృష్టిని త‌న‌వైపు మ‌ర‌ల్చుకోవ‌డం ద్వారా కేసీఆర్ తానేంటో చాటుకుంటున్నారు. అవ‌కాశాలు క‌లిసివ‌స్తే ఆయ‌న దేశ రాజ‌ధానిలో జెండా ఎగ‌రేసే రోజు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన ప‌నిలేదు. అదే జ‌రిగితే చంద్ర‌బాబుకి అంత త్వ‌ర‌గా జీర్ణ‌మ‌య్యే విష‌యం కాద‌ని భావించ‌వ‌చ్చు.






Related News

bjp

పోల‌వ‌రంపై క‌న్నేసిన క‌మ‌ల‌నాధులు

Spread the loveఏపీ బీజేపీ నేత‌లు దూకుడు పెంచుతున్నారు. క్ర‌మంగా చంద్ర‌బాబు స‌ర్కారుపూఐ ఒత్తిడి పెంచే య‌త్నం చేస్తున్నారు. కొద్దికాలంRead More

telugudesam tdp

టీడీపీని బ‌హిష్క‌రించేశారు..!

Spread the loveఅధికార పార్టీని బ‌హిష్క‌రించారు. అది కూడా ఓ ప‌ట్ట‌ణంలోని పార్టీ కార్య‌క‌ర్త‌లు స‌మావేశం ఏర్పాటు చేసుకుని తీసుకున్నRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *