చిన‌జీయ‌ర్ వివాదంలో దేవినేని ఉమా..!

devineni uma
Spread the love

ఏపీ మంత్రి దేవినేని ఉమా వివాదంలో ఇరుక్కున్నారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారం రేపేలా ఉన్నాయి. ఉమా వ్య‌వ‌హారాన్ని ప‌లు సంస్థ‌లు త‌ప్పుబ‌డుతున్నాయి. హిందువ‌ల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని విమ‌ర్శిస్తున్నారు. దేవినేని ఉమా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

తాజాగా విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడిన దేవినేని ఉమా తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్ మీద విమ‌ర్శ‌లు చేస్తూ దారిన పోయే వాళ్ల కాళ్లు ప‌ట్టుకుంటేనో, యాగాలు చేస్తేనో ఫ‌లితం ఉండ‌ద‌న్నారు. ఏం చేసినా చిత్త‌శుద్ధి ఉండాల‌న్నారు. గంట‌న్న‌ర పాటు వేచి చూసి కేవీపీ రామ‌చంద్ర‌రావు డైరెక్ష‌న్ లో కాళ్లు ప‌ట్టుకున్న జ‌గ‌న్ పౌరుషం ఏమ‌య్యింద‌ని ఆయ‌న నిల‌దీశారు. పులివెందుల పౌరుషం ఎక్క‌డా అని ప్ర‌శ్నించారు.

దాంతో ఈ వ్యాఖ్య‌ల మీ వీహెచ్పీ నేత‌లు తీవ్రంగా స్పందించారు. యాగాలు చేస్తే ఫ‌లితాలు రావంటూ మంత్రి వ్యాఖ్య‌లు చేయ‌డం త‌గ‌ద‌న్నారు. దారిన పోయేవాళ్ల కాళ్లు ప‌ట్టుకున్నారంటూ చిన‌జీయ‌ర్ స్వామీజీ ని కించ‌ప‌రిచేలా మంత్రి వ్యాఖ్య‌లున్నాయ‌ని మండిప‌డ్డారు. త‌క్ష‌ణం దేవినేని ఉమా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళ‌న చేప‌డ‌తామ‌న్నారు. చిన‌జీయ‌ర్ భ‌క్తులు కూడా మంత్రి తీరును ఆక్షేపిస్తున్నారు. దాంతో ఈ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.


Related News

ys jagan

వ్యూహాత్మక గందరగోళంలో వైసీపీ

Spread the loveవైసీపీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వరుసగా ఎదురవుతున్న సవాళ్లతో చిక్కుల్లో పడినట్టు కనిపిస్తోంది. పాదయాత్ర విషయంలో పదే పదే వాయిదాలుRead More

ys jagan

జగన్ కి ఊరటనిచ్చిన కోర్ట్

Spread the loveవైసీపీ అధినేత వైఎస్ జగన్ కి స్వల్ప ఊరట దక్కింది. అత్యంత ఆసక్తిరేపిన కోర్ట్ తీర్పు వెలువడడంతోRead More

 • జనసేన ప్లీనరీ
 • జనసేన నాయకుడు అరెస్ట్
 • ఆస్పత్రిలో చేరిన వెంకయ్య
 • వైసీపీని వీడని సందిగ్ధం
 • వైసీపీకి వరంలా మారిన రేవంత్ రెడ్డి
 • టీడీపీలోకి వచ్చేయండి..బుట్టా రేణుక పిలుపు
 • ఐలయ్యకు క్రేజ్ పెంచిన కోమటోళ్లు
 • లోకేష్ వినకపోయినా బాబు మాటకు కట్టుబడిన పవన్ !
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *