వివాదాల్లో సీఎం ఆఫీస్

Chandrababu-naidu-serious-on-media-houses
Spread the love

ఏపీలో అధికార పార్టీ వ్యవహారాలతో పాటు అధికార కేంద్రం కూడా ఆది నుంచి వివాదాల్లో ఉంది. చివరకు ముఖ్యమంత్రి కార్యాలయమే సమస్యలకు కేరాఫ్ గా మారుతోందనే వాదన ఉంది. రాష్ట్ర పాలనా యంత్రారగానికి అత్యరత కీలకమైన సీఎంఓపై విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పారదర్శకత లోపిస్తోందని, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయన్న ఆరోపణ లొస్తున్నాయి. ఇవన్నీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా పట్టిరచుకోవడం లేదని తెలుస్తోరది. ఇటీవల స్వయంగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్‌ కృష్ణారావు సిఎంఓపై చేసిన ఆరోపణల్లో వాస్తవాలున్నట్లు తాజా పరిస్థితులు తేల్చిచెబుతున్నాయి. చివరకు ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిరచే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయన్న విమర్శలొస్తున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక ఉన్నతాధికారి వద్ద పనిచేసే ద్వితీయ శ్రేణి అధికారి పాత్ర కూడా ఈ వ్యవహారంలో చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది

ప్రభుత్వం అమలు చేసే ఏ కార్యక్రమానికి ఆమోదం లభిరచాలన్నా ముఖ్యమంత్రికి ఫైలు వెళ్లాల్సి ఉరటురది. అయితే చాలా ఫైళ్లు ముఖ్యమంత్రికి చేరడం లేదని, చివరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తెలియకుండానే కొన్ని ఆదేశాలు క్షేత్ర స్థాయి అధికారులకు వెళ్లిపోతున్నాయని తెలుస్తోరది. మరికొన్ని అరశాల్లో ఉన్నతాధికారులకు వాస్తవాల్ని వివరిరచకుండానే వారిని తప్పుదోవ పట్టిస్తున్న ఘటనలు కూడా చోటుచేసుకురటున్నట్లు సమాచారం. ఇవే ప్రభుత్వానికి నష్టం కలిగిరచేవిగా పరిణమిస్తున్నాయని సీనియర్‌ అధికారులు కూడా కొరతమంది అరటున్నారు. గతంలో ఎసిబి కేసులుండి ప్రస్తుతం పేషీలో ఉన్న ఒక అధికారికి తాజాగా పదోన్నతి కూడా కల్పిరచినట్లు తెలిసిరది. ఇదే సమయంలో ఆయనపై ఉన్న కేసులు ఎత్తివేసినట్లు సమాచారర. ఇదే అధికారి ఇప్పుడు పేషీలో పెత్తనాన్ని చూపిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిధులను జాతీయ బ్యారకుల్లో నిల్వ చేసే సాంప్రదాయం ఉరది. దీనిపై గతంలోనే కొన్ని అధికారిక సూచనలు కూడా జిల్లాలకు వెళ్లాయి. అయితే తాజాగా జిల్లాల్లో ఉన్న నిధులను ఓరియంటల్‌ బ్యారకు ఆఫ్‌ కామర్స్‌లో డిపాజిట్‌ చేయాలని పేషీ నురచి ద్వితీయ శ్రేణి అధికారి ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలిసిరది. దీనిపై కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారర. గతంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు, ఆసుపత్రులకు మందులు సరఫరా చేసే కొన్ని సంస్థలను ప్రభుత్వం బ్లాక్‌ లిస్టులో పెట్టిరది. అయితే వాటిల్లో కొన్ని సంస్థలకు పాత బకాయిలను చెల్లిరచారని, దానిపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పనిచేసాయని అరటున్నారు. ఇటువంటి కొన్ని ఘటనలు ఉన్నతాధికారి దృష్టికి వెళ్లినప్పటికీ, చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని, ఇతర సీనియర్‌ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు అవినీతిని నివారిరచాలని ముఖ్యమంత్రి పదేపదే చెబుతున్నప్పటికీ, తన పేషీలోనే పారదర్శకత సన్నగిల్లడం విమర్శలకు తావిస్తోరది. వీటిని దగ్గరుండి పరిశీలిరచిన ఐవైఆర్‌ కృష్ణారావు కొద్ది రోజుల క్రితం సిఎంఓపై ఘాటుగానే స్పరదిరచి నేరుగా ముఖ్యమంత్రికే లేఖ రాసారు. అయినప్పటికీ ఆశిరచిన స్థాయిలో స్పరదన లేకపోవడం గమనార్హం.


Related News

chandrababu-naidu-and-SomuV

వీర్రాజు నోట జైలు మాట‌….

Spread the loveప్ర‌త్యేక హోదా పేరుతో త‌మ‌ను బ‌ద్నాం చేస్తున్న చంద్ర‌బాబుకి బ్రేకులు వేయాల‌ని బీజేపీ భావిస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. దానికిRead More

jayaprakash narayan

జేపీకి అది ద‌క్కుతుందా?

Spread the love2Sharesలోక్ స‌త్తా అధినేత చూపులు హ‌స్తిన వైపు మ‌ళ్లాయి. ఢిల్లీ రాజ‌కీయాల వైపు ఆయ‌న చూస్తున్నారు. కానీRead More

 • హీరో శివాజీపై బీజేపీ దాడి
 • బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!
 • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
 • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *