టీడీపీలో కొట్లాట

clash in tdp
Spread the love

పార్టీ అదినేత జిల్లాలో పర్యటిస్తుండగానే తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. ఒకరిపై ఒకరు తెగబడ్డారు. వర్గాలుగా విడిపోయి వీరంగా చేశారు. దాంతో అనంతపురంలో హఠాత్తుగా వాతావరణం వేడెక్కింది. తెలుగుదేశం నేతల తీరు మీద పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్ర నగరంలో టీడీపీనేతలు బాహాబాహీకి దిగారు. తాడిపత్రి లో పెత్తనం చెలాయిస్తున్న జేసీ వర్గం… అనంతపురంలోనూ పెత్తనం కోసం ప్రయత్నించడం వివదానికి కారణంగా మారింది. దాంతో అనంతపురంలో జేసీ వర్గం తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటోంది.

తాజాగా అనంతపురం కార్పోరేషన్ కార్యాలయంలో జరిగిన నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీలో ఏకంగా జేసీ వర్గం కార్పొరేటర్లను మరో వర్గం టీడీపీ కార్పొరేటర్లు దాడి చేసి కొట్టారు. చాలాకాలంగా అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. రోడ్ల విస్తరణతో మొదలైన వివాదం రగులుతూనే ఉంది. అనంతపురంపై పట్టుసాధించేందుకు జేసీ చేసిన ప్రయత్నాలకు ప్రభాకర్ చౌదరి గండికొడుతూనే ఉన్నారు. ఈనేపథ్యంలో స్టాండింగ్ కమిటీ సమావేశం జరగ్గా…. తమ డివిజన్లలో అభివృద్ధి జరగకుండా ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అడ్డుపడుతున్నారని జేసీ వర్గం కార్పొరేటర్‌ ఒకరు ఆరోపించారు. దీంతో ఆగ్రహించిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు… జేసీ వర్గం కార్పొరేటర్‌ను కొట్టి పంపించారు. దిక్కున్న చోట చెప్పుకో అంటూ వెళ్లగొట్టారు.

దాంతో అనంత టీడీపీలో కలకలం రేగింది. ఇప్పటికే జెడ్పీ వివాదం కొలిక్కి వస్తుందని భావిస్తుండగా తాజాగా కార్పోరేషన్ రాజకీయాలు తెరమీదకు రావడం కాక రేపుతోంది.


Related News

dgp sambasivarao

దోబూచులాట ముగిసింది: నండూరికే అవకాశం దక్కింది

Spread the loveకేంద్రం , రాష్ట్రం మద్య రాయబారాలు, ఉత్తర ప్రత్యుత్తురాల తర్వాత ఎట్టకేలకు కొత్త డీజీపీ ఖరారయ్యారు. నండూరిRead More

dgp samabasivarao ips

సాంబశివరావుకి ఛాన్స్ వస్తుందా..

Spread the loveడిజీపీ పదవీ కాలం కొనసాగింపు విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది.Read More

 • వైసీపీలో మరో కమిటీ
 • వైసీపీ నేతపై రేప్ కేసు
 • పవన్ ని కలిసిన లండన్ ఫ్యాన్స్
 • మరో ఫిరాయింపు ఎమ్మెల్యేకి పదవి
 • బాబు వల్ల కాదంటున్న జేసీ
 • జగన్ దూరం కావడంతో బాబు పెంచేశారు..
 • జగన్ ఛాలెంజ్ పై టీడీపీ అనూహ్య స్పందన
 • చంద్రబాబుకి 15రోజులు సమయమిచ్చిన జగన్
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *