Main Menu

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the love

మెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్ మీట్ నిర్వ‌హించాల‌ని భావించినా ఆయ‌న ససేమీరా అన్నారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల్లో తాను ఏ రీతిలో కూడా జ‌న‌సేన‌కు మ‌ద్ధ‌తు ఇవ్వ‌లేన‌ని చిరంజీవి తేల్చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి ప్రెస్‌మీట్ పెడుతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రిగినా చివ‌ర‌కు అది వాస్త‌వ రూపం దాల్చ‌లేదు. త‌మ్ముళ్లిద్ద‌రూ బ‌రిలో ఉన్న‌ప్ప‌టికీ అన్న మాత్రం తెర‌మీద‌కు రావ‌డానికి సిద్ధంగా లేన‌ట్టు తేల్చేశారు. దాంతో గాజువాక‌, భీమ‌వ‌రం బ‌రిలో ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి గానీ, న‌ర్సాపురం ఎంపీ సీటు కోసం రంగంలో ఉన్న నాగేంద్ర బాబు కోసం గానీ చిరంజీవి గొంతు విప్పే అవ‌కాశం లేద‌ని తేలిపోయింది.

ప‌వ‌న్ క‌న్నా ముందే పొలిటిక‌ల్ ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్ర‌జారాజ్యం ద్వారా ఫెయిల్యూర్ నేత‌గా మిగిలిపోయారు. ఆ త‌ర్వాత సొంత పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేసి ఎంపీగా, కేంద్ర మంత్రిగా ప‌నిచేసే ఛాన్స్ ద‌క్కించుకున్నారు. ఏడాది క్రితం ఎంపీగా ప‌ద‌వి కాలం ముగిసిన త‌ర్వాత రాజ‌కీయంగా పెద‌వి విప్ప‌డానికి సైతం దూర‌మ‌య్యారు. పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టి సాగుతున్నారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *