Main Menu

చంద్ర‌బాబుకి అన్నీ చేదు ఫ‌లితాలే..!

Spread the love

కొత్త ఏడాది ప్రారంభం కాక‌ముందే ప‌ని ఎదురు దెబ్బ‌లు తింటున్న చంద్ర‌బాబుకి 2019 ఆరంభంలోనే క‌ష్టాలు మొద‌ల‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే తెలంగాణా సీఎం చేస్తున్న ప్ర‌య‌త్నాలు, మోడీ వ్య‌వ‌హారాల‌కు త‌గ్గ‌ట్టుగానే కోర్టుల్లో కూడా చేదు ఫ‌లితాలు ఎదుర‌వుతున్నాయి. ఇప్ప‌టికే వైఎస్ జ‌గ‌న్ పై జ‌రిగిన దాడి కేసు ఎన్ ఐఏ కి చేర‌డం చంద్ర‌బాబు స‌ర్కారుకి ఎదురుదెబ్బ‌గానే భావించాలి. ప్ర‌చారం కోస‌మ‌ని, జ‌గ‌న్ అభిమానే చేశార‌ని, అది అస‌లు దెబ్బే కాద‌ని, కోడి క‌త్తి, చివ‌ర‌కు వైఎస్ విజ‌య‌మ్మే కొడుకు మీద దాడి చేయించింద‌ని ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేసిన టీడీపీ నేత‌లకు తాజాగా ఏపీ హైకోర్ట్ నిర్ణ‌యం రుచించే అవ‌కాశం లేదు.

ఎన్ఐఏకి కేసు బ‌దాల‌యించిన నేప‌థ్యంలో ప‌రిణామాలు ఎలా ఉంటాయోన‌నే బెంగ మొద‌ల‌య్యింది. కేంద్రం అస‌లే క‌త్తులు నూరుతున్న స‌మ‌యంలో ఈ వ్య‌వ‌హారం మ‌రింత కాక రేపే అవ‌కాశాలు లేక‌పోలేదు. అందులోనూ ఎన్నిక‌ల ముందు జ‌రిగే ఏ చిన్న ప‌రిణామం అయినా పెద్ద ప్ర‌భావం చూప‌డం ఖాయంగా ఉన్న త‌రుణంలో ఈ వ్య‌వ‌హారం విశేషంగా మార‌బోతోంది. అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వంలో భోగ‌స్ కంపెనీల‌కు భూములు కేటాయించారంటూ దాఖ‌ల‌యినా పిల్ ఇప్పుడు క‌ల‌క‌లం రేపేలా ఉంది.

కోర్ట్ విచార‌ణ‌కు స్వీక‌రించింది. ఈనెల 21న త‌దుప‌రి విచార‌ణ సాగ‌బోతోంది. 200 కంపెనీల‌కు సంబంధించిన ఆధారాల‌ను పిటీష‌న‌ర్ శ్ర‌వ‌ణ్ కుమార్ కోర్ట్ కి స‌మ‌ర్పించారు. ఏపీఐఐసీ ద్వారా భూములు ద‌క్కించుకున్న కంపెనీల‌లో ఏకంగా 200 కంపెనీల వివ‌రాలు త‌న‌కు ల‌భిస్తే అందులో 175 బోగ‌స్ కంపెనీలేన‌ని పిటీష‌న‌ర్ ఆరోపిస్తున్నారు. ఆధారాలు కోర్ట్ కి స‌మ‌ర్పించిన‌ట్టు వెల్ల‌డించారు. దాంతో ఈ వ్య‌వ‌హారం ఎటు మ‌ళ్లుతుందోన‌నే బెంగ టీడీపీ నేత‌ల్లో మొద‌ల‌వుతోంది. చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ఆధ్వ‌ర్యంలోనే ఇదంతా జ‌రిగింద‌ని పిటీష‌న‌ర్ చెబుతున్న త‌రుణంలో ఈ కేసు కూడా విచార‌ణ‌కు వ‌స్తే వ్య‌వ‌హారం ఎటు మ‌ళ్లుతుందోన‌నే చ‌ర్చ సాగుతోంది.

ఇక బీజేపీ నేత‌లు కూడా దూకుడు పెంచి, ఏకంగా సీఎం కాన్వాయ్ ని అడ్డుకోవ‌డం ఆ సంద‌ర్భంగా కాకినాడ‌లో చంద్ర‌బాబు చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. మీరు ఫినిష్ అయిపోతారంటూ సీఎం అన‌డాన్ని బీజేపీ నేత‌లు సీరియ‌స్ గా తీసుకుంటున్నారు. దాంతో మ‌రోసారి మాట‌ల యుద్ధం ఎటు మ‌ళ్లుతుందోన‌నే ఆస‌క్తి పెరుగుతోంది. ఈ ప‌రిణామాల‌తో ఏపీ రాజ‌కీయాల్లో చంద్ర‌బాబుని స‌మ‌స్య‌లు చుట్టిముట్టేలా క‌నిపిస్తున్నాయ‌న్న‌ది ఓ అంచ‌నా.


Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *