Main Menu

చంద్రబాబు అస‌హ‌నం

Spread the love

టీడీపీ నేత‌ల‌పై సీఎం చంద్ర‌బాబు అస‌హ‌నం ప్ర‌ద‌ర్శించారు. ముఖ్యంగా మంత్రుల ప‌నితీరుని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. రాజ‌కీయంగా వేడి రాజుకుంటున్న వేళ మంత్రుల వ్య‌వ‌హార‌శైలి ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మంత్రులు సీరియ‌స్ గా క‌నిపించ‌డం లేద‌ని సీఎం పేర్కొన‌డం విశేషంగా మారింది. రాజకీయంగా కీల‌క ప‌రిణామంగా క‌నిపిస్తోంది.

తాజాగా ఏపీ క్యాబినెట్ భేటీ త‌ర్వాత చంద్ర‌బాబు మంత్రుల‌తో స‌మావేశ‌మ‌య్యారు. రాజ‌కీయంగా ప‌లు అంశాలు చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగానే ప్రతిపక్షాలకు కౌంటర్ ఇవ్వడంలో మంత్రులు విఫలం అయ్యారని ఆగ్రహం చేశారు. దేనికైనా నేనొక్కడినే సమాధానం చెబుతున్నా..మీరెవరూ పట్టించుకోవడం లేదంటూ మండిప‌డ్డారు. మంత్రులుగా ఉండి సీరియస్ నెస్ లేదంటూ వ్యాఖ్యానించారు.

సీఎం తీరుతో ప‌లువురు ఖంగుతినాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా రాష్ట్ర,జాతీయ రాజకీయాల్లో మంత్రులు సరిగా స్పందించడం లేదన్న,ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలకు ధీటైన సమాధానం చెప్పాలని మంత్రుల‌కు సూచించారు. కొంద‌రు మంత్రుల‌కు ఈ విష‌యం ప‌ట్ట‌రానిద‌య్యిందంటూ చంద్ర‌బాబు అస‌హ‌నం ప్ర‌దర్శించ‌డంతో ప‌లువురు మంత్రులు అవాక్క‌య్యారు. కొంద‌రు మంత్రుల‌ను పేరు పెట్టి మ‌రీ చంద్రబాబు సీరియ‌స్ కావ‌డం విశేషంగా క‌నిపిస్తోంది.






Related News

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the loveమెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్Read More

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *