Main Menu

మాజీ మంత్రుల‌కు బాబు మొండి చేయి..!

Spread the love

ఏపీ రాజ‌కీయాల్లో ముంద‌స్తు ఏర్పాట్లకు చంద్ర‌బాబు పూనుకుంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీకి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. శ్రేణులు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. అదే స‌మ‌యంలో కేసీఆర్ త‌ర‌హాలోనే ముంద‌స్తుగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే ఆలోచ‌న‌లో ఉన్నారు. వ‌చ్చే సంక్రాంతి త‌ర్వాత అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న ఉంటుంద‌ని చెప్పేశారు. తొలి విడ‌త‌లో 60 నుంచి 70 మంది పేర్లు ఉంటాయ‌ని అంచ‌నా వేస్తున్నారు. దాంతో మూడో వంతు జాబితా ముందుగా ప్ర‌క‌టించేందుకు టీడీపీ అధినేత స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది.

అయితే ఈ జాబితాలో ప‌లువురు సీనియ‌ర్ల‌కు మొండిచేయి చూపించేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. అందులో ప్ర‌ధానంగా ఇద్ద‌రు మ‌హిళా మాజీ మంత్రులకు నిరాశ త‌ప్ప‌ద‌ని భావిస్తున్నారు. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పీత‌ల సుజాత‌కు ఈసారి ఝ‌ల‌క్ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో ఆచంట నుంచి గెలిచిన ఆమె మొన్న‌టి ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడి వ‌ల‌స వెళ్లారు. అక్క‌డి నుంచి గెలిచి క్యాబినెట్ మంత్రిగా మూడున్న‌రేళ్ల పాటు ప‌నిచేశారు.అ యితే ఆమె సొంత జిల్లాకు చెందిన ఎంపీ మాగంటి బాబు, విప్ చింత‌మ‌నేని వంటి వారితో ఆమె విబేధాల‌తో క్యాబినెట్ హోదా కోల్పోవాల్సి వ‌చ్చింది. త్వ‌ర‌లో ఆమెకు టికెట్ కూడా ద‌క్క‌డం అనుమాన‌మేన‌ని భావిస్తున్నారు. ఆమె స్థానంలో ప్ర‌స్తుతం స‌మాచార శాఖ‌లో ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అదికారి రామాంజ‌నేయులు అల్లుడికి అవ‌కాశం ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. చింత‌ల‌పూడి నుంచి రాజేష్ గ‌తంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హించారు. మొన్న‌టి ఎన్నిక‌ల్లో సుజాత చేతిలో ఆయ‌న భార్య‌ ఓట‌మి పాల‌య్యారు. ఆత‌ర్వాత టీడీపీకి ద‌గ్గ‌ర‌య్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఆన‌య‌తో బాటుగా మాజీ జెడ్పీ చైర్మ‌న్ కోరా జ‌య‌రాజ్ వంటి వారు బ‌లంగా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. దాంతో ఈసారి సుజాత‌కు హ్యాండివ్వ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌ల‌ప‌డుతోంది.

అదే స‌మ‌యంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లికి చెందిన మ‌రో మాజీ మంత్రి కిమిడి మృణాళిని కూడా ఆజాబితాలో ఉంటార‌ని స‌మాచారం. ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు కళా వెంక‌ట్రావుకి మృణాళిని స‌మీప బంధువు. ఆ కోటాలోనే ఆమెకు మొన్న‌టి ఎన్నిక‌ల్లో అవ‌కాశం వ‌చ్చింది. ఆ వెంట‌నే క్యాబినెట్ లో సీటు ద‌క్కింది. విస్త‌ర‌ణ‌లో క‌ళా వెంక‌ట్రావుకి అవ‌కాశం రావ‌డంతో ఆమెపై వేటు ప‌డింది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆమెకు సీటు కూడా కేటాయించే అవ‌కాశం ఉండ‌ద‌ని చెబుతున్నారు. చీపురుప‌ల్లి నుంచి మాజీ ఎమ్మెల్యే గ‌ద్దె బాబూరావు వంటి వారు బ‌లంగా ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. వారికి జిల్లాకు చెందిన ప‌లువురు నేత‌ల మ‌ద్ధ‌తు కూడా ఉండ‌డంతో ఈసారి ఈ మాజీ మంత్రిని కూడా ప‌క్క‌న పెట్టేసే ప్ర‌య‌త్నాలు సాగుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏమ‌యినా ఇద్ద‌రు మాజీ మ‌హిళా మంత్రుల‌కు చంద్ర‌బాబు షాక్ ఇస్తార‌నే ప్ర‌చారం ఇప్పుడు టీడీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.


Related News

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

వైసీపీ రెండో జాబితా ఎంపీ అభ్య‌ర్థులు

Spread the loveశ్రీకాకుళం- దువ్వాడ శ్రీనివాస్ విజ‌య‌న‌గ‌రం- బెల్లాని చంద్ర‌శేఖ‌ర్ విశాఖ‌ప‌ట్ట‌ణం-ఎంవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ అన‌కాప‌ల్లి- డాక్ట‌ర్ స‌త్య‌వ‌తి కాకినాడ వంగాRead More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *