చంద్రబాబుకి అస్వస్థత

chandrababu-sad1
Spread the love

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రాజధానిలో నిర్మించనున్న మెడిసిటీ భవనానికి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసి సభలో మాట్లాడుతుండగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు. తుళ్లూరు మండలం దొండపాడులో మెడిసిటీకి శంకుస్థాపన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడారు. విద్యా వైద్యానికి అమరావతిని హబ్‌గా మారుస్తామన్నారు. భవిష్యత్తులో అమరావతికి గల్ఫ్‌ దేశాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. త్వరలో అమరావతి నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమరైట్స్‌ (దుబాయి)కు విమాన సర్వీసులు ప్రారంభిస్తామన్నారు.

బహిరంగ సభలో 20 నిమిషాల పాటు మాట్లాడిన అనంతరం ముఖ్యమంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి కూర్చుండిపోయారు. రెండు నిమిషాల అనంతరం తేరుకొని యధావిధిగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రికి అలసటగా కనిపించడంతో సీఎంవో అధికారులు అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న మంత్రి పుల్లారావు సీఎం ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.






Related News

jagancbn

బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…

Spread the loveఏపీ ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. గడిచిన 60 రోజులుగా సాగుతున్న యాత్ర ఇప్పటికేRead More

chandrababu

పరువు కాపాడుకోవడానికి బాబు…

Spread the loveఅడుసు తొక్కనేల ..కాళ్లు కడగనేల అన్నట్టుగా మారింది చంద్రబాబు పరిస్థితి. మత్స్యకారులకిచ్చిన ఎన్నికల హామీని అమలుచేయమన్నందుకు ఆయనRead More

  • పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు
  • ఆ లేఖ ఫేక్
  • జనసేనానికి తలైవా పాఠం?
  • పోలవరంలో కొత్త తగాదా
  • రాజమౌళికి షాకిచ్చిన రాజధాని
  • రంగంలోకి జేసీ సన్స్
  • కొత్త జిల్లాలకు చంద్రబాబు వెనకడుగు..
  • శ్రీలంకకు ఊరట విజయం
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *