పరువు కాపాడుకోవడానికి బాబు…

chandrababu
Spread the love

అడుసు తొక్కనేల ..కాళ్లు కడగనేల అన్నట్టుగా మారింది చంద్రబాబు పరిస్థితి. మత్స్యకారులకిచ్చిన ఎన్నికల హామీని అమలుచేయమన్నందుకు ఆయన చిటపటలాడారు. తాటతీస్తానంటూ బెదిరించారు. దాంతో ఆ సామాజికవర్గంలో మంటలు చెలరేగాయి. మత్స్యకార నాయకుల మీద చంద్రబాబు బెదిరింపులతో కలకలం రేగింది. పలు చోట్ల ఆందోళనలు సాగాయి.

ఆ తాకిడితో చంద్రబాబు దిగివచ్చారు. విశాఖపట్నంలో వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన వారిపై చిందులు వేసిన చంద్రబాబు తీరు మారిపోయింది. తూర్పు గోదావరి జిల్లా జన్మభూమి సభలో మాట మార్చేశారు. మత్స్యకారులను ఎస్టీలలో చేర్చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. రెండు రోజుల ముందు కూడదన్నది..ఇప్పుడు ఖాయం చేసి చాలామందిని ఆశ్చర్యపరిచారు.

చంద్రబాబు పరువు కాపాడుకునే ప్రయత్నంలోనే ఇలాంటి మాటలు ఉపయోగించి ఉండవచ్చని అంతా భావిస్తున్నారు. బోయలను ఎస్టీలలో చేర్చడానికి ప్రక్రియ ప్రారంభించిన చంద్రబాబు మత్స్యకారులను ఎందుకు విస్మరించారని ప్రశ్నిస్తున్నారు. తమ గోడు చెప్పుకుందామని వెళ్లిన ఫిషర్ మెన్ నాయకులపై ప్రతాపం చూపడం ఎలా సమర్థనీయం అంటున్ానరు. దాంతో చంద్రబాబు ని మత్స్యకారులు మరోసారి విశ్వసిస్తారా లేదా అన్నది చూడాలి.« (Previous News)Related News

jagancbn

బాబు, జగన్ కూడా అదే నియోజకవర్గంలో…

Spread the loveఏపీ ప్రతిపక్ష నేత ప్రజాసంకల్ప యాత్రలో ముందుకు సాగుతున్నారు. గడిచిన 60 రోజులుగా సాగుతున్న యాత్ర ఇప్పటికేRead More

chandrababu

పరువు కాపాడుకోవడానికి బాబు…

Spread the loveఅడుసు తొక్కనేల ..కాళ్లు కడగనేల అన్నట్టుగా మారింది చంద్రబాబు పరిస్థితి. మత్స్యకారులకిచ్చిన ఎన్నికల హామీని అమలుచేయమన్నందుకు ఆయనRead More

 • పవన్ మాట విని పరువు తీసిన చంద్రబాబు
 • ఆ లేఖ ఫేక్
 • జనసేనానికి తలైవా పాఠం?
 • పోలవరంలో కొత్త తగాదా
 • రాజమౌళికి షాకిచ్చిన రాజధాని
 • రంగంలోకి జేసీ సన్స్
 • కొత్త జిల్లాలకు చంద్రబాబు వెనకడుగు..
 • శ్రీలంకకు ఊరట విజయం
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *