బాబుకి బడ్జెట్ భయం!

Chandrababu-naidu-serious-on-media-houses
Spread the love

కేంద్ర బడ్జెట్ కాక పూర్తిగా తగ్గలేదు. పార్లమెంట్ బడ్జెట్ సెషన్ తొలివిడత సమావేశాలు ముగుస్తుండడంతో సీన్ కొంత మారే అవకాశం ఉంది. కానీ అదే సమయంలో అమరావతిలో వేడి రాజుకోవడం ఖాయంగా ఉంది. ఈసారి ఏపీ బడ్జెట్ గురించి ఆసక్తికర చర్చ మొదలవుతోంది. హామీల అమలు విషయంలో కేంద్రాన్ని అన్ని పక్షాలు నిలదీస్తున్నాయి. ఎవరి మార్గంలో వారు మోడీ సర్కారు తీరుని ప్రశ్నిస్తున్నారు. ఏపీకి రావాల్సిన నిధుల కోసం పట్టుబడుతున్నారు. ఇప్పటికే మోడీ, జైట్లీ ప్రకటనలు కూడా వారిని సంత్రుప్తి పరచలేదని చెబుతున్నారు.

అదే సమయంలో రాష్ట్ర బడ్జెట్ లో కూడా పలు హామీలు నెరవేర్చాల్సి ఉంది. నిరుద్యోగభ్రుతి, రుణమాఫీ వంటి కీలకాంశాలు సహా పలు మాటలు నీటిరాతలుగానే ఉన్నాయి. కొన్ని అరకొరగా అమలయినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా లేవు. దాంతో చంద్రబాబు వ్యవహారం చర్చల్లోకి రాబోతోంది. బీజేపీ నేతలు కూడా గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయబోతున్నారు. ముఖ్యంగా కేంద్రం నుంచి వచ్చిన నిధులపై లెక్కలు తీస్తున్నారు. తమను బద్నాం చేస్తున్న దానికి కౌంటర్ గా ఇచ్చిన నిధులకు సంబంధించిన వివరాలపై పట్టుబట్టాలని చూస్తున్నారు. ఇటు అసెంబ్లీ, అటు మండలిలో బీజేపీ నేతలు బలంగా టీడీపీని కార్నర్ చేయాలనే ఆదేశాలు అమిత్ షా నుంచి వచ్చినట్టు సమాచారం.

ఉదాహరణకు కేంద్రం హౌసింగ్ స్కీమ్ కింద ఇచ్చిన 34వేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. డీపీఆర్ లేకుండా రాజధాని నిధుల మాటేంటని అడుగుతున్నారు. ఇలా ఓవైపు బీజేపీ ప్రశ్నిస్తే మరోవైపు వైసీపీ ఎదురుదాడి ఖాయంగా ఉంది. కేంద్రాన్ని హామీల గురించి, చట్టాల గురించి ప్రశ్నిస్తున్న చంద్రబాబు అండ్ కో, తాము మ్యానిఫెస్టోలో పెట్టిన మాటలు ఎలా మరచిపోతారని బలంగా ఎదురించే అవకాశం కనిపిస్తోంది. దాంతో ఏపీ బడ్జెట్ లో కూడా వేడి రాజుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కొత్త రాజకీయ తగాదాలకు అమరావతి వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది

కేంద్ర బడ్జెట్ మాదిరిగానే చంద్రబాబు సర్కారుకి కూడా ఇదే చివరి బడ్జెట్. ఎన్నికల ముందు బడ్జెట్ కావడంతో ఎన్నో వరాలు వస్తాయనే ఆశ జనంలో ఉంటుంది. దానికి తగ్గట్టుగా కేటాయింపులు లేకపోతే చాలామంది ఫైరయ్యే అవకాశం ఉంది. ప్రతిపక్షాలన్నీ కలిసి చంద్రబాబు బడ్జెట్ మీద కూడా దుమ్మెత్తిపోసే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే చంద్రబాబు కూడా ఈ విషయంలో కొంత కలవరపడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే గత బడ్జెట్ లో భారీగా ఎంవోయూలు వచ్చాయని చెప్పి ప్రచారం చేసుకున్న నేపథ్యంలో వాటి గురించి నిలదీస్తే నీళ్లు నమలాల్సి వస్తుందని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. ఏమయినా కేంద్ర బడ్జెట్ తరహాలో ఏపీ బడ్జెట్ కూడా ఎన్నో వివాదాలకు నిలయంగా మారే అవకాశం స్పష్టంగా ఉంది.


Related News

jayaprakash narayan

జేపీకి అది ద‌క్కుతుందా?

Spread the loveలోక్ స‌త్తా అధినేత చూపులు హ‌స్తిన వైపు మ‌ళ్లాయి. ఢిల్లీ రాజ‌కీయాల వైపు ఆయ‌న చూస్తున్నారు. కానీRead More

shivaji

హీరో శివాజీపై బీజేపీ దాడి

Spread the loveబీజేపీ శ్రేణులు రెచ్చిపోతున్నాయి. ప్ర‌త్యేక హోదా కోసం నిన‌దిస్తున్న వారిపై బౌతిక దాడులు ప్రారంభించారు. తాజాగా సినిమాRead More

 • బ్రేక‌ప్ కి బాబు డిసైడ్…!
 • క‌మల వ్యూహంలో టీడీపీ విల‌విల‌లాడాల్సిందేనా?
 • సంచలనంగా మారిన జగన్ ప్రకటన
 • పవన్ కి ప్రయాస తప్పదు..!
 • బాబుకి బడ్జెట్ భయం!
 • కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..
 • బడ్జెట్ పై బాబు రెండు కళ్ల సిద్ధాంతం
 • సోము వీర్రాజుకి మళ్లీ నిరాశే..
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *