బాబు సందేహం ఎందుకో…?

modi babu
Spread the love

ఏపీ ఆశలను తుంచేసిన కేంద్రం తీరు మీద ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా కేంద్రంగా బీజేపీ తీరును నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఎన్నికల ముందు బడ్జెట్ లో కూడా తమను సంత్రుప్తి పరచలేకపోయారంటూ మండిపడుతున్నారు. దాని సెగ తెలుగుదేశం నేతలను కూడా తాకింది. టీడీపీ కూడా అధికారికంగానే బడ్జెట్ మీద అసంత్రుప్తి వ్యక్తం చేసింది. ఏపీ ప్రజలకు అన్యాయం చేసిందంటూ సీఎం కూడా వ్యాఖ్యానించడం చర్చనీయాంశం. అదే సమయంలో టీడీపీ అంతర్గత సమావేశంలో రాజీనామాల ప్రస్తావన రావడం కూడా విశేషంగా గమనించవచ్చు.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశంగా బడ్జెట్ మారుతోంది. ప్రత్యేక హోదా కాదన్నా, ప్యాకేజీ రాదన్నా, పోలవరం లేదన్నా..రైల్వేజోన్ సాధ్యం కాదన్నా సహించిన జనాలు చివరకు బడ్జెట్ కేటాయింపుల్లో కూడా తమకు తగిన న్యాయం జరగలేదనే అభిప్రాయంతో కనిపిస్తున్నారు. సరిగ్గా ఇలంటి పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. కానీ అదంతా గతంలో. వర్తమానంలో ఆయన వేగంగా నిర్ణయాలు తీసుకోవడానికి తీవ్ర జాప్యం చేస్తారనే దానికి తగ్గట్టుగా వ్యవహరిస్తున్నారు. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమవుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ మీద వ్యతిరేకత తనను తాకకుండా చూసుకోవడంలో ఆయన సఫలీక్రుతం కాలేకపోతున్నారు.

దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఓటుకు నోటు సహా అనేక కేసులో ఆయన మీద ఉన్నాయి. ఇప్పుడు ఉన్నపళంగా బీజేపీతో తెగతెంపులు అంటే దేశవ్యాప్తంగా దాని ప్రభావం ఉంటుంది. ఇప్పటికే శివసేన కమలనాధులను బ్లాక్ మెయిల్ చేస్తోంది. టీడీపీ కూడా అదే క్రమంలో మరో అడుగుముందుకేస్తే మాత్రం ఎన్డీయే కూటమిలో కలకలం తప్పదు. దాంతో మోడీ ఆగ్రహానికి బాబు గురయ్యే అవకాశాలు అధికం. అలాంటి పరిస్థితిని గమనించడం వల్లే చంద్రబాబు సందేహంతో కనిపిస్తున్నారని చాలామది భావిస్తున్నారు.కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధం కాలేకపోతున్నారని చెబుతున్నారు. బాబు వ్యక్తిగత బలహీనతల ప్రభావం ఏపీ ప్రయోజనాల మీద పడుతున్నట్టు కనిపిస్తోందని పలువురు వ్యాఖ్యానించడానికి ఆస్కారం ఇస్తోంది. కటీఫ్ చెప్పడానికి సానుకూలత ఉన్నా ఏమీ చేయలేని స్థితిలో ఉండడం వల్ల బ్రేకప్ కి ఇంకొంత కాలం పడుతుందనే అభిప్రాయం బలపడుతోంది.


Related News

Paradise-Papers-Will-Narendra-Modi-Come-to-YS-Jagan-Rescue

బీజేపీతో వైసీపీ పొత్తు ఉంటుందా?

Spread the loveఇదో చర్చ సాగుతోంది. బీజేపీ, వైసీపీ మధ్య బంధం కొంత కాలంగా బలపడుతోంది. రాజకీయ అవసరాల రీత్యాRead More

ys jagan

జగన్ కి పెద్ద లోటు

Spread the loveప్రతీ నాయకుడు తెరమీద రాణించాలంటే తెరవెనుక చాలామంది శ్రమించాల్సి ఉంటుంది. కార్యకర్తల నుంచి వ్యూహకర్తల వరకూ అనేకRead More

 • నారా లోకేష్ కి అవార్డ్
 • ఏపీలో ఎన్నికలు జరుగుతాయా?
 • బీజేపీకి రాజీనామాలు
 • వైసీపీలో జగన్ ని మించిపోతున్న ఎంపీ
 • వైసీపీకి ‘కాపు’ కాచేనా…?
 • జ‌గ‌న్ కి జ‌న‌సేన‌ని ద‌గ్గ‌ర చేస్తున్న బాబు
 • బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?
 • రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *