Main Menu

బాబుకి ఝ‌ల‌క్: ఏపీ కి మ‌ళ్లీ టోపీ!

andhra_graph1467892388
Spread the love

కేంద్రంలో బీజేపీ పెద్ద‌లు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ట్ల చిన్న‌చూపు కొన‌సాగిస్తున్నారు. ఏపీని అన్నిర‌కాలుగా ఆదుకుంటామ‌ని చెప్పిన నేత‌లే ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. చివ‌ర‌కు రెవెన్యూ లోటు విష‌యంలోనూ ఏపీ ఆశ‌ల‌ను నీరుగార్చేస్తున్నారు. చంద్ర‌బాబుకి చుక్క‌లు చూపిస్తున్నారు. ఏపీ వాసులను ఆందోళ‌న‌కు గురిచేస్తున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత తొలి ఏడాది ఏర్పడిన రెవెన్యూ లోటు రూ.4117.89 కోట్లు మాత్రమేనని కేంద్రం తేల్చిచెప్పింది. ఇందులో ఇప్పటికే రూ.2303 కోట్లు మంజూరు చేశామని.. మిగతా మొత్తాన్ని త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేసింది. కంప్ట్రో‌లర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) లెక్కల ప్రకారం రెవెన్యూ లోటును రూ.16వేల కోట్లుగా పరిగణించాలన్న రాష్ట్రప్రభుత్వ అభ్యర్థనను కేంద్రం తోసిపుచ్చింది. దాంతో ఏపీ ప్ర‌యోజ‌నాల కోసం, రెవెన్యూ లోటు భర్తీకి చేసిన విజ్ఞప్తులన్నిటినీ బుట్టదాఖలు చేసింది. ప్ర‌త్యేక ఫ్లైట్స్ పెట్టుకుని హ‌స్తిన తిరిగినా ప్ర‌యోజ‌నం ద‌క్క‌లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. తాజాగా పార్ల‌మెంట్ లో కేంద్రం ఈ లెక్క‌లు వెల్ల‌డించ‌డం ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు నోట్లో వెల‌క్కాయ‌ప‌డ్డ‌ట్ట‌య్యింది.

కేంద్ర ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా లెక్కించి తొలి ఏడాది రెవెన్యూ లోటును రూ. 4117.89కోట్లుగా తేల్చినట్లు మేఘ్వాల్‌ తెలిపారు. ‘విభజన తేదీ అయిన 2014 జూన్‌ 2 నుంచి 2015 మార్చి 31 వరకు రాష్ట్ర రెవెన్యూ లోటు రూ.13775.76 కోట్లుగా ఉందని కాగ్‌ కేంద్రానికి నివేదక పంపింది. అయితే ఇందులో రైతుల రుణమాఫీ కింద రూ.7069.67 కోట్లను విభజనానంతరం ఖర్చు చేసినట్లు అందులో పేర్కొంది. అంతేకాకుండా సామాజిక భద్రతలో భాగంగా లబ్ధిదారులకు గతంలో ఇస్తున్న పెన్షన్‌ మొత్తాన్ని పెంచడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.3391.20 కోట్ల అదనపు భారం పడిందని, డిస్కంలకు విద్యుత్‌ బకాయిలకుగాను రూ.1500కోట్లు చెల్లించిందని వెల్లడించింది. కొత్త పథకాలకు చెల్లించిన మొత్తం రెవెన్యూ లోటు కిందకు రాదు. లోటును లెక్కించడానికి మా లెక్కలు మాకున్నాయి.

అర్హత మేరకే రాష్ట్రానికి రెవెన్యూ లోటు మొత్తాన్ని అందజేస్తాం’ అని స్పష్టం చేశారు. కాగా.. 2017-18 బడ్జెట్‌ లెక్కల ప్రకారం దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్థిక లోటును ఎదుర్కొంటున్నాయని మేఘ్వాల్‌ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రూ.23,054 కోట్లు, తెలంగాణ రూ.26,096 కోట్ల లోటును ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు.

దాంతో ఈ ప‌రిణామాలు టీడీపీ అధినేత‌ను క‌ల‌వ‌ర‌ప‌రుస్తున్నాయి. ఓవైపు పోల‌వ‌రం అంచ‌నా వ్య‌యం స‌వ‌రించ‌డానికి కేంద్రం సిద్దంగా లేదు. మ‌రోవైపు రెవెన్యూ లోటు పూడిక విష‌యంలో అర‌కొర‌గా స్పందిస్తోంది. ఇత‌ర అనేక స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం లేదు. మొత్తంగా మోడీ ప్ర‌భుత్వం చంద్ర‌బాబుకి స‌హాయ‌నిరాక‌ర‌ణ చేస్తుందా అనే అనుమానం బ‌ల‌ప‌డుతోంది. ఏపీ వాసుల ప్ర‌యోజ‌నాల‌కు చంద్ర‌బాబు అడ్డంకి అన్న‌ట్టుగా భావించే ప‌రిస్థితి వ‌చ్చేసింది.


Related News

akhila priya

లోకేష్ ప్ర‌క‌ట‌న‌తో అఖిల‌ప్రియ‌కు అవ‌స్థ‌లు..

Spread the loveక‌ర్నూలు జిల్లా టీడీపీ వ్య‌వ‌హారాలు ఆస‌క్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా నారా లోకేష్ రాజేసిన మంట ఇప్పుడిప్పుడే చ‌ల్లారేలాRead More

kiran-kumar-reddy

కిర‌ణ్ రాక‌తో వాపా, బ‌ల‌మా?

Spread the loveఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ చివ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం మ‌ళ్లీ సొంతగూటికి చేరుతున్నారు. ఏపీ రాజ‌కీయాల్లో మ‌రోసారి క్రియాశీల‌కంగా మార‌బోతున్నారు.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *