కేంద్రమంత్రి తీరుపై చంద్రబాబు గుర్రు..

Sujana
Spread the love

ఏపీ సీఎం చంద్రబాబు తన సహచరుడి పట్ల అసహనం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యవహారశైలిని చంద్రబాబు తప్పుబట్టారు. ఢిల్లీలో ఆయన తీరుని సీఎం జీర్ణించుకోలేకపోతున్నారు. పదే పదే చెబుతున్నా మంత్రి సరిదిద్దుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మోడీతో మంత్రి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన తీరును చంద్రబాబు అసహనానికి గురిచేసింది. వెంటనే సీఎం కూడా సుజనా తీరును తప్పుబడుతూ ఫోన్ లో తన అసంత్రుప్తిని వ్యక్తం చేసినట్టు టీడీపీ వర్గాల సమాచారం.

వాస్తవానికి సుజనా చౌదరి ఓ కార్పోరేట్ కంపెనీ అధినేతగా కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెరపడానికే ప్రాధాన్యతనిస్తారు. అంతేగాకుండా ఆయన మీద పలు అభియోగాలున్న నేపథ్యంలో మోడీ లాంటి వారితో కయ్యానికి సిద్ధం కాలేని స్థితి ఆయనది. అయినా రాజకీయంగా ఇబ్బందులు ఎదురవుతాయన్న అభిప్రాయంతో చంద్రబాబు కొంత ఒత్తిడి తెస్తున్నప్పటికీ సుజాన మాత్రం పెద్దగా ఖాతరు చేయడం లేదు. అదే పార్టీ అధినేతకు ఆగ్రహం కలిగిస్తోంది.

ఢిల్లీలో పార్టీ వ్యవహారాల పట్ల సుజనా చౌదరి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. మోడీతో సమావేశాన్ని ఓ రొటీన్ సమావేశమే అన్న అర్థం వచ్చే వ్యాఖ్యలు చేయడంపై అసహనాన్ని వ్యక్తం చేసిన ఆయన, రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెబుతూ, న్యాయం జరిగేందుకు ఎలా పోరాడాలో నిర్ణయించేందుకు సమావేశమైతే, దాన్ని రొటీన్ అని చెప్పడమేంటని చంద్రబాబు ప్రశ్నించారు.

అంతేగాకుండా పార్లమెంట్ ముందు నిరసనల్లో కేవలం ఏడుగురు ఎంపీలు మాత్రమే పాల్గొనడం కూడా చంద్రబాబుకి చికాకు కలిగించిందని సమాచారం.


Related News

Paradise-Papers-Will-Narendra-Modi-Come-to-YS-Jagan-Rescue

బీజేపీతో వైసీపీ పొత్తు ఉంటుందా?

Spread the loveఇదో చర్చ సాగుతోంది. బీజేపీ, వైసీపీ మధ్య బంధం కొంత కాలంగా బలపడుతోంది. రాజకీయ అవసరాల రీత్యాRead More

ys jagan

జగన్ కి పెద్ద లోటు

Spread the loveప్రతీ నాయకుడు తెరమీద రాణించాలంటే తెరవెనుక చాలామంది శ్రమించాల్సి ఉంటుంది. కార్యకర్తల నుంచి వ్యూహకర్తల వరకూ అనేకRead More

 • నారా లోకేష్ కి అవార్డ్
 • ఏపీలో ఎన్నికలు జరుగుతాయా?
 • బీజేపీకి రాజీనామాలు
 • వైసీపీలో జగన్ ని మించిపోతున్న ఎంపీ
 • వైసీపీకి ‘కాపు’ కాచేనా…?
 • జ‌గ‌న్ కి జ‌న‌సేన‌ని ద‌గ్గ‌ర చేస్తున్న బాబు
 • బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?
 • రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *