Main Menu

చేతులు కాల్చుకున్న చంద్ర‌బాబు

Spread the love

ఇటీవ‌ల చంద్ర‌బాబు నిర్ణ‌యాలు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. అనూహ్యంగా స్పందిస్తున్న తీరు విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది. ఓ పోలీస్ అధికారి బ‌దిలీ విష‌యంలో టీడీపీ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరు వివాదానికి దారితీసింది. బ‌దిలీ చేసిన అధికారి మౌనంగా ఉండ‌గా, ఏపీ ప్ర‌భుత్వం త‌రుపున కోర్టులో పిటీష‌న్ వేయ‌డాన్ని ప‌లువురు త‌ప్పుబట్టారు.

అయినా వెన‌క్కి త‌గ్గ‌కుండా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం వేసిన పిటీష‌న్ విష‌యంలో ఎదురు దెబ్బ త‌గిలింది. ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర రావు బ‌దిలీ విష‌యంలో కోర్ట్ కూడా ఈసీ ఉత్త‌ర్వుల మీద స్పందించేందుకు నిరాక‌రించ‌డంతో టీడీపీ నేత‌ల‌కు షాక్ త‌గిలింది. అనివార్యంగా ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుని బ‌దిలీ చేస్తూ ఉత్త‌ర్వులు విడుద‌లు చేయాల్సి వ‌చ్చింది.

ముగ్గురు అధికారుల‌ను బ‌దిలీ చేయాల‌ని ఈసీ ఆదేశాలు ఇవ్వ‌గా మూడు రోజుల క్రితం ఇద్ద‌రిని మాత్ర‌మే బ‌దిలీ చేసిన ఏపీ ప్ర‌భుత్వం ఆఖ‌రికి ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుని కూడా ఎన్నిక‌ల విధుల నుంచి త‌ప్పించాల్సిన అఘాయిత్యం దాపురించింది. దాంతో బాబు వ్యూహం బెడిసికొట్టిన‌ట్టుగా చెప్ప‌వ‌చ్చు. ఏబీని కాపాడుకోవాల‌ని వ్య‌వ‌స్థ‌ల మీద ఆయ‌న వేసిన ఎత్తులు విఫ‌లం కావ‌డంతో బాబు మంత్రం ఫ‌లించ‌డం లేద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డేందుకు దోహ‌దం చేసింది. ఇలా వ‌రుస‌గా వివాదాలు కొనితెచ్చుకుని చేతులు కాల్చుకుంటున్న చంద్ర‌బాబు తీరుతో పార్టీ శ్రేణుల్లోనూ నిరాశ క‌లుగుతోంది.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *