Main Menu

నంద‌మూరి బాల‌య్య క్ష‌మాప‌ణ‌లు

Spread the love

హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత టీడీపీ అభ్య‌ర్థి నంద‌మూరి బాల‌కృష్ణ క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం సంద‌ర్భంగా జ‌రిగిన ప‌రిణామాల‌పై ఆయ‌న చింతిస్తూ ప్ర‌క‌ట‌న జారీ చేశారు.

హిందూపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియా ప్రతినిధిపై చేయి చేసుకున్న వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఆయన మీడియా ప్రతినిధులకు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ పోస్టు చేశారు.

‘‘మీడియా మిత్రులకి నమస్కారం.. నా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడున్న చిన్న పిల్లల మీద పడి వీడియో తీస్తున్నవారు అల్లరిమూకల పని అని భావించి వారిని వద్దని వారించడం జరిగింది. అక్కడ ఉన్నది మీడియా వారని ఆ తర్వాతే తెలిసింది. అంతే కానీ ఉద్దేశ పూర్వకంగా చేసింది కాదు. ఈ విషయంలో మీడియా మిత్రులకి బాధ కలిగించి ఉంటే క్షమాపణ కోరుతూ… మీ నందమూరి బాలకృష్ణ’’ అని పోస్ట్ చేశారు.






Leave a Reply

Your email address will not be published. Required fields are marked *