నిషేధంలోకి కంచె ఐల‌య్య పుస్త‌కం?

ap tv
Spread the love

కంచ ఐలయ్య వివాదాస్పద పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు – కోమటోళ్లు’ పుస్తకాన్ని నిషేధించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం యోచన చేస్తోంది. ఆర్యవైశ్యులను కించపరిచేలా ఐలయ్య రాసిన పుస్తకం ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. డీజీపీ సాంబశివరావు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావులను పిలిపించుకొని మాట్లాడారు. వైశ్యుల మనోభావాలను దెబ్బతీసేలా ఐలయ్య రాసిన పుస్తకాన్ని నిషేధించాలని ఎవరైనా ఫిర్యాదు చేశారా? అని పోలీస్‌ బాస్‌ను ఆరా తీసినట్లు తెలిసింది. మంత్రి శిద్ధా రాఘవరావుతోపాటు పలు జిల్లాల్లో ఆర్యవైశ్యులు ఆ పుస్తకానికి వ్యతిరేకంగా పత్రికలు, టీవీల్లో ప్రకటనలు చేశారని డీజీపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ వివరించారు. రోజు రోజుకూ వైశ్యుల్లో ఆందోళన పెరుగుతోందని సీఎంకు చెప్పినట్లు తెలిసింది. దాంతో, సమాజంలో అశాంతిని రేకెత్తించే వాటిపై కఠినంగా ఉండాలని సీఎం నిర్దేశించినట్లు తెలిసింది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.






Related News

dgp sambasivarao

దోబూచులాట ముగిసింది: నండూరికే అవకాశం దక్కింది

Spread the loveకేంద్రం , రాష్ట్రం మద్య రాయబారాలు, ఉత్తర ప్రత్యుత్తురాల తర్వాత ఎట్టకేలకు కొత్త డీజీపీ ఖరారయ్యారు. నండూరిRead More

dgp samabasivarao ips

సాంబశివరావుకి ఛాన్స్ వస్తుందా..

Spread the loveడిజీపీ పదవీ కాలం కొనసాగింపు విషయంలో కేంద్రం కొర్రీలు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారుతోంది.Read More

  • వైసీపీలో మరో కమిటీ
  • వైసీపీ నేతపై రేప్ కేసు
  • పవన్ ని కలిసిన లండన్ ఫ్యాన్స్
  • మరో ఫిరాయింపు ఎమ్మెల్యేకి పదవి
  • బాబు వల్ల కాదంటున్న జేసీ
  • జగన్ దూరం కావడంతో బాబు పెంచేశారు..
  • జగన్ ఛాలెంజ్ పై టీడీపీ అనూహ్య స్పందన
  • చంద్రబాబుకి 15రోజులు సమయమిచ్చిన జగన్
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *