ఇసుకలో మళ్లీ విధానం మార్చేసిన బాబు

sand
Spread the love

ఏపీ సీఎం మళ్లీ విధానం మార్చేశారు. ఇసుక విషయంలో మూడోసారి పాలసీలో సమూల మార్పులు చేశారు. తొలుత అధికారంలోకి రాగానే డ్వాక్రా సంఘాలకు ఇసుకు ర్యాంపుల నిర్వహణ అప్పగించిన చంద్రబాబు, ఆ తర్వాత దానిని ఉచిత ఇసుకగా మార్చేశారు. అయినా ర్యాంపుల్లో మాఫియా వ్యవహారాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు సాగుతూనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇసుక రూపంలో కోట్ల రూపాయలు దండుకుంటున్న విషయం రాజకీయంగా పెను దుమారంగా మారుతున్న దశలో చంద్రబాబు మరోసారి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఏకంగా ఇసుక ర్యాంపుల నిర్వహణ పూర్తిగా ప్రైవేట్ పరం చేసేశారు. క్యాటలాగ్ అవుట్ సోర్సింగ్ ఐటీ సొల్యూషన్స్ అనే సంస్థకు ఇసుక ర్యాంపుల నిర్వహణ అప్పగించారు. ఇక పై ఇసుక తవ్వకాలు, ర్యాంపుల నిర్వహణ, ట్రాన్స్ పోర్ట్ కూడా క్యాటలాగ్ సంస్థ ద్వారానే జరుగుతుందని ఆదేశాలు వచ్చేశాయి. దాంతో ఇసుక ప్రైవేటు పరం చేసిన విషయం వివాదంగా మారేలా కనిపిస్తోంది.

చంద్రబాబు ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేటుపరం చేయగా తాజాగా సహజవనరులను సైతం ప్రైవేట్ పరం చేయడం విశేషంగా మారింది. పదే పదే ఇసుక విధానంలో సర్కారు వైఫల్యాన్ని అంగీకరిస్తూ, విధానాలు మార్చుకుంటున్న తీరు ప్రభుత్వాన్ని అభాసుపాాలుజేస్తోంది. అయినా ఇసుక మాఫియా ఆగడాలు మాత్రం తగ్గే అవకాశాలు ఏమేరకన్నది చూడాలి. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇసుకను క్యాటలాగ్ సంస్థకు అప్పగించారు. త్వరలోనే రాష్ట్రమంతా ఆ సంస్థ చేతుల్లోకి వెళుతుందనే చర్చ మొదలవుతోంది.


Related News

Paradise-Papers-Will-Narendra-Modi-Come-to-YS-Jagan-Rescue

బీజేపీతో వైసీపీ పొత్తు ఉంటుందా?

Spread the loveఇదో చర్చ సాగుతోంది. బీజేపీ, వైసీపీ మధ్య బంధం కొంత కాలంగా బలపడుతోంది. రాజకీయ అవసరాల రీత్యాRead More

ys jagan

జగన్ కి పెద్ద లోటు

Spread the loveప్రతీ నాయకుడు తెరమీద రాణించాలంటే తెరవెనుక చాలామంది శ్రమించాల్సి ఉంటుంది. కార్యకర్తల నుంచి వ్యూహకర్తల వరకూ అనేకRead More

 • నారా లోకేష్ కి అవార్డ్
 • ఏపీలో ఎన్నికలు జరుగుతాయా?
 • బీజేపీకి రాజీనామాలు
 • వైసీపీలో జగన్ ని మించిపోతున్న ఎంపీ
 • వైసీపీకి ‘కాపు’ కాచేనా…?
 • జ‌గ‌న్ కి జ‌న‌సేన‌ని ద‌గ్గ‌ర చేస్తున్న బాబు
 • బాబుని మోడీ లైట్ తీసుకుంటున్నారా…?
 • రాజీనామాకి రెడీ అయిన జ‌గ‌న్!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *