అవును..నిధులు ప‌క్క‌దారి ప‌ట్టాయ్

amaravathi
Spread the love

కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన నిధుల‌ను ఇత‌ర అవ‌స‌రాల‌కు వినియోగించిన విష‌యం వాస్త‌వ‌మేన‌ని రాష్ట్రం అంగీక‌రించింది. చంద్రబాబు ప్ర‌భుత్వం చేసిన వ్య‌యానికి సంబంధించిన లెక్క‌ల విష‌యంలో తాజాగా ఏపీ భ‌వ‌న్ ఓ నివ‌దిక రూపొందించింది. అందులో కొంత‌మేర‌కు నిధుల‌ను ఇత‌ర అవ‌స‌రాల‌కు మ‌ళ్లించిన మాట వాస్త‌వ‌మేన‌ని చెప్ప‌డం విశేషం. దాంతోనే యూసీలు స‌కాలంలో అందించ‌లేక‌పోయిన‌ట్టు చెబుతోంది. ఇప్ప‌టికే కేంద్రం నుంచి రావాల్సిన 500 కోట్ల రూపాయ‌ల నిధులు నిలిచిపోయాయ‌ని చెబుతోంది.

ఇప్ప‌టి వ‌ర‌కూ 13 పథకాలకు సంబంధించి కేంద్రం విడుదల చేసిన రూ. 3300 కోట్ల ఖర్చుకు వినియోగ ధ్రువీ కరణ పత్రాలు (యుసి)లు అధికారులు సమర్పించ లేదని నివేదిక‌లో పేర్కొన్నారు. ఈ విధానం కొన‌సాగితే కేంద్రం నుంచి నిధులు వ‌చ్చే అవ‌కాశం ఉండ‌ద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ విష‌యంలో త‌క్ష‌ణం స్పందించాల్సి ఉంటుంద‌ని ఏపీ భ‌వ‌న్ నుంచి అమ‌రావ‌తికి లేఖ‌లు రాసిన‌ట్టు చెబుతున్నారు. కొన్ని రంగాల‌కు సంబంధించి ఏకంగా నాలుగేళ్లుగా యూసీలు ఇవ్వ‌డం లేద‌ని పేర్కొన‌డం విశేషంగా మారింది. యుసి సమర్పించని వాటిలో స్మార్ట్‌ సిటీలకు వచ్చిన నిధులు, రాజధాని నిర్మాణానికి వచ్చిన నిధులు, పిఎంఎవై నిధులకు సంబంధించిన వివ‌రాలే అధికంగా ఉన్నాయి. స్మార్ట్‌ సిటీలకు రూ.1125 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ. వెయ్యి కోట్లు, ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కిరద రూ. 338 కోట్లు రాగా, వాటి వినియోగ ధ్రువీకరణ త్రాలు స‌మ‌ర్పించ‌లేద‌ని నివేదికలో పేర్కొన్నారు. ఇత‌ర విభాగాల‌కు సంబంధించిన యూసీలు కూడా అందించి ఉంటే క‌నీసంగా 500కోట్ల‌కు త‌గ్గ‌కుండా కేంద్రం నుంచి నిధులు విడుద‌ల జ‌రిగేద‌ని చెబుతున్నారు.

నిధుల వినియోగంలో అస‌మగ్రంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే స‌మ‌స్య‌కు అస‌లు కార‌ణంగా క‌నిపిస్తోంది. కేంద్రం విడుద‌ల చేసిన ల‌క్ష్యానికి భిన్నంగా రాష్ట్రం అవ‌స‌రాల పేరుతో ఆ నిధుల‌ను మ‌ళ్లించ‌డంతోనే యూసీల స‌మ‌స్య వ‌స్తోంద‌ని చెబుతున్నారు. దానిని స‌రిదిద్ద‌కుండా అదికారుల మీద ఒత్తిడి పెంచినా స‌మ‌స్య ప‌రిష్కారం కాద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మొత్తంగా చంద్ర‌బాబు పాల‌న‌లో నిధులు మ‌ళ్లిస్తున్నార‌నే బీజేపీ ప్ర‌చారానికి త‌గ్గ‌ట్టుగానే ఏపీ భ‌వ‌న్ నివేదిక రావ‌డం విశేషంగా చెప్ప‌వ‌చ్చు.


Related News

jdlakshminarayana11521726505

జేడీ ఆ కండువా క‌ప్పుకుంటారా?

Spread the loveజేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌. జ‌గ‌న్ కేసుల పుణ్యాన మంచి క్రేజ్ సంపాదించారు. ఓ పోలీస్ విచార‌ణాధికారిగా ఉన్న వ్య‌క్తికిRead More

Vijay-Sai-Reddy-Controversi

విజ‌య‌సాయిరెడ్డి మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveటీడీపీ రూటు మార్చింది. వైఎస్ జ‌గ‌న్ తో పాటుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో కూడా సీరియ‌స్Read More

 • ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కేసు!
 • వైసీపీ ఎంపీల రాజీనామాలు
 • పవన్ కళ్యాణ్ పై మళ్లీ కత్తిదూశాడు…!
 • వైసీపీ ఇంకెప్పుడు నేర్చుకుంటుందో..!
 • బాబుకి మోడీ స‌మాధానం ఎలా ఉంటుంది?
 • క‌మ‌లంలో కాక రాజుకుంది..
 • వైసీపీ ఓ అడుగు వేసిన‌ట్టే..
 • చంద్ర‌బాబుకి, కేసీఆర్ కి తేడా అదే!
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *