హోదాతో ప‌నేముందిక‌…?

cii summitt vizag
Spread the love

ఏపీ అభివృద్ధి కావాలంటే ప్ర‌త్యేక హోదా కావాల్సిందేన‌ని చాలామంది భావిస్తున్నారు. గ‌త నాలుగేళ్లుగా ప్ర‌భుత్వం చెబుతున్న మాట‌లు ఎలా ఉన్నా అభివృద్ధి కుంటుప‌డింద‌నే న‌మ్ముతున్నారు. ప‌రిశ్ర‌మ‌లు రాలేద‌ని భావిస్తున్నారు. పెట్టుబడుల ప్ర‌చారం ఎలా ఉన్నా ఆచ‌ర‌ణ‌లో ప‌రిశ్ర‌మ‌లు రావాలంటే హోదా ఉండాల్సిందేన‌ని నిల‌దీస్తున్నారు. కానీ చంద్ర‌బాబు స‌ర్కారు తీరు మాత్రం దానికి భిన్నంగా ఉంది. ఇంకా చెప్పాలంటే భార‌త‌దేశం క‌న్నా తామే ముందున్నామ‌ని ఏపీ ప్ర‌భుత్వం చెబుతోంది.

దాంతో బీజేపీ పెద్ద‌లు కొత్త వాద‌న ముందుకు తెస్తున్నారు. హోదా లేకుండానే ల‌క్షల కోట్ల ఎంవోయూలు చేస్తున్న‌ప్పుడు కొత్త‌గా ప్ర‌త్యేక హోదా ఎందుక‌ని వాదిస్తున్నారు. చంద్ర‌బాబు ఘ‌న‌త వ‌ల్ల ఏపీకి పెట్టుబ‌డుల వ‌ర‌ద పారేస్తుంటే అద‌నంగా ప్ర‌త్యేక హోదా అవ‌స‌రం ఏముంద‌ని నిల‌దీస్తున్నారు. భార‌త‌దేశం క‌న్నా ముందున్న రాష్ట్రానికి హోదా ఇవ్వాల్సిన ప‌నేముంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దాంతో మొత్తంగా ఇప్ప‌టికే ఏపీకి హోదా లేని కార‌ణంగా చివ‌ర‌కు టీడీపీ నేత‌లు కూడా పెట్టుబ‌డుల‌న్నీ కూడా ఇత‌ర రాష్ట్రాల‌కు త‌ర‌లిపోతుంటే విశాఖ‌లో స‌మ్మిట్ ల పేరుతో సాగుతున్న ప్ర‌చార భాగోతం మాత్రం అస‌లు కే ఎస‌రు తెచ్చేలా క‌నిపిస్తోంది.

చివ‌ర‌కు చంద్ర‌బాబు వైఖ‌రితో ఏపీకి ఒన‌గూరే ప్ర‌య‌జ‌నాల మాట అలా ఉంచితే పెద్ద న‌ష్ట‌మే త‌ప్ప‌ద‌నే వారు పెరుగుతున్నారు. ఏపీ అభివృద్ధికి ఈ ప్ర‌చారం పెద్ద అడ్డంకిగా మారుతోంద‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. స‌న్ రైజ్ స్టేట్ అంటూ సాగిస్తున్న ప్ర‌చార‌వ్య‌యంతో ఏపీలో ప‌లు కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే అవ‌కాశం ఉన్న విష‌యాన్ని విస్మ‌రించ‌డంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.


Related News

Vijay-Sai-Reddy-Controversi

విజ‌య‌సాయిరెడ్డి మీద గురిపెట్టిన టీడీపీ

Spread the loveటీడీపీ రూటు మార్చింది. వైఎస్ జ‌గ‌న్ తో పాటుగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విష‌యంలో కూడా సీరియ‌స్Read More

Nara-and-Pawan

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ప‌రువు న‌ష్టం కేసు!

Spread the loveటీడీపీ అనూహ్యంగా స్పందిస్తోంది. త‌న మాజీ మిత్ర‌ప‌క్షం నాయ‌కుడు ప‌ట్ల క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. దానికిRead More

 • వైసీపీ ఎంపీల రాజీనామాలు
 • పవన్ కళ్యాణ్ పై మళ్లీ కత్తిదూశాడు…!
 • వైసీపీ ఇంకెప్పుడు నేర్చుకుంటుందో..!
 • బాబుకి మోడీ స‌మాధానం ఎలా ఉంటుంది?
 • క‌మ‌లంలో కాక రాజుకుంది..
 • వైసీపీ ఓ అడుగు వేసిన‌ట్టే..
 • చంద్ర‌బాబుకి, కేసీఆర్ కి తేడా అదే!
 • హోదాతో ప‌నేముందిక‌…?
 • Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *