Main Menu

నెల రోజులే మిగిలింది…!

Spread the love

ఎన్నిక‌ల న‌గారా మోగింది. సాధారణ ఎన్నిక‌ల స‌మ‌ర‌శంఖం పూరించారు. ఈ ఎన్నిక‌ల‌కు ఇంకా నెల రోజులు మాత్ర‌మే గ‌డువు మిగల‌డం విశేషం. ఈనెల‌లోనే నోటిఫికేష‌న్ విడుత‌ల‌వుతుండ‌గా ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అందులోనూ ఏపీలో అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో ఈ వ్య‌వ‌హారం మ‌రింత ఆస‌క్తిగా మారింది.

ఏప్రిల్ 11న పోలింగ్ జ‌ర‌గ‌బోతున్న త‌రుణంలో ఇంకా కేవ‌లం నెల రోజులు మాత్ర‌మే మిగిలి ఉంది. దాంతో పార్టీల స‌న్నాహాలు మ‌రింత చురుగ్గా సాగాల్సి ఉంది. అంతేగాకుండా ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన త‌ర్వాత ఏకంగా నెలా 13 రోజుల పాటు ఫ‌లితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. మే 13న ఫ‌లితాలు విడుద‌ల అవుతుండ‌డంతో సుదీర్ఘ‌కాలం పాటు వేచి చూడ‌క త‌ప్ప‌దు.

ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించిన నోటిపికేష‌న్ ఎల్లుండ మార్చి 12న విడుద‌ల కాబోతోంది. నామినేష‌న్ల దాఖ‌ల‌కుకు ఈనెల 25 ఆఖ‌రు తేదీ కాగా, విర‌మ‌ణ‌కు 28 చివ‌రి తేదీ. పోలింగ్ ఏప్రిల్ 11న ఒకేసారి తెలంగాణా, ఏపీలో జ‌ర‌గ‌బోతున్న నేప‌థ్యంలో అటు హైద‌రాబాద్, ఇటు ఏపీలో కూడా ఓట్లు న‌మోదు చేయించుకున్న ప‌లువురి కి ఆ ఛాన్స్ లేకుండా పోతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

ఏపీలో ఎన్నికల ప్రచారానికి అతి తక్కువ సమయం మాత్ర‌మే మిగిలింది. కేవలం 15-20 రోజులు మాత్రమే ప్రచారానికి అవకాశం ఉండ‌డంతో పార్టీల‌కు క‌స‌ర‌త్తులు వేగవంతం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆఖరి నిమిషంలో టిక్కెట్ల ఖరారైన అభ్యర్ధులకు చుక్కలు చూపించనున్న ఎన్నికల షెడ్యూల్ గా ప‌లువురు భౄవిస్తున్నారు.

వీలైనంత త్వరగా అభ్యర్ధులను ఖరారు చేయక తప్పని పరిస్థితుల్లో పార్టీలున్నాయి. అందుకు అనుగుణంగానే రెబెల్స్ బుజ్జగింపులు పెద్ద స‌మ‌స్య‌గా మారుతున్నాయి. అధినేతల ప్రచారానికి సమయం సరిపోతుందో లేదోననే ఆందోళన స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. టీడీపీ త‌రుపున ఇప్పటికే 120 మంది అభ్యర్ధులను ఖరారు చేసిన చంద్రబాబు మిగిలిన వారి కోసం స‌న్నాహాలు పూర్తి చేయాల్సి ఉంటుంది.

వైసీపీ కూడా లిస్టు ఖరారు చేసిన నేప‌థ్యంలో ఒక‌టి రెండు రోజుల్లో జాబితాను విడుద‌ల చేసేందుకు జ‌గ‌న్ స‌న్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్ కేంద్రంగా అభ్యర్ధుల కసరత్తు చేస్తోన్న జగన్ ఈనెల 12న అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మ‌రోవైపు అభ్యర్ధుల ఎంపికపై ఇప్పటికీ ఓ కొలిక్కిరాని జనసేన కసరత్తు ఎలా అన్న‌దే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారుతోంది.

ఒకే విడతలో ఏపీ ఎన్నికలు
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీ
ఆంద్రప్రదేశ్ లోకసభ
మార్చి 19 నోటిఫికేషన్
25.03.19 నామినేషన్లు
26.03.19 పరిశీలన
29.03.29 ఉపసంహరణలు
ఏప్రిల్ 11న పోలింగ్


Related News

త‌మ్ముళ్ల‌కు ‘మెగా’ ఝ‌ల‌క్

Spread the loveమెగాస్టార్ ఝ‌ల‌క్ ఇచ్చారు. సోద‌రుల ఆశ‌ల‌పై నీళ్లు జ‌ల్లారు. కుటుంబ‌మంతా ఒక్క‌టేన‌ని చాటేందుకు చిరంజీవితో ఓ ప్రెస్Read More

వైసీపీ హోరు గాలి, టైమ్స్ నౌ తాజా స‌ర్వే

Spread the loveజాతీయ మీడియా సంస్థ‌ల స‌ర్వేల‌లో వైసీపీ హోరు గాలి వీస్తోంది. ఆపార్టీకి సంపూర్ణ ఆధిక్యం ఖాయంగా క‌నిపిస్తోంది.Read More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *